Saturday, January 18, 2025
Homeసినిమాఈనెల 8న ‘కొండవీడు’ విడుదల

ఈనెల 8న ‘కొండవీడు’ విడుదల

Kondaveedu: దసరాజు గంగాభవాని బోధన్ పల్లి అలివేలు సమర్పణలో బి. పి. ఆర్ సినిమా పతాకం పై బిగ్ బాస్ ఫేమ్ శ్వేతా వర్మ, ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ , నళినీకాంత్ , నవీన్‌రాజ్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన చిత్రం కొండ‌వీడు. సిద్దార్థ శ్రీ దర్శకత్వంలో ప్రతాప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 8 న గ్రాండ్ గా థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్నారు.

శ్వేతా వర్మ మాట్లాడుతూ.. మా “కొండవీడు” సినిమా టీజర్, ట్రైలర్ ను విడుదల చేసిన శ్రీకాంత్ గారికి, సునీల్ గారికి ధన్యవాదాలు. కోవిడ్ టైమ్ లో చాలా సినిమాలు చేశాను. నేను బిగ్ బాస్ లో ఉన్నపుడు ప్రతాప్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేశారు.ఈ సినిమాను మొదట ఓటిటి లో రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు. అయితే రామకృష్ణ గారు చూసి మంచి కంటెంట్ ఉన్న ఇలాంటి సినిమా థియేటర్ లో రిలీజ్ చేయాలని ముందుకు వచ్చాడు. ఇందుకు మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది.

నిర్మాతలు కోవిడ్ టైమ్ లో కూడా చాలా ప్రికాషన్స్ తీసుకొని ఖర్చుకు వెనుకడకుండా చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు మంచి ఔట్ పుట్ వచ్చే వరకు మాతో వర్క్ చేసుకున్నాడు. ఇలాంటి మంచి దర్శకులు, నిర్మాతలు ఇండస్ట్రీ లో ఉండడం వలన ఎంతో మంది ఆర్టిస్టులకు ఉపాధి దొరుకుతుంది. ఈ నెల 8 న వస్తున్న మా చిత్రాన్ని మమ్మల్ని ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్