Wednesday, June 26, 2024
Homeసినిమాబన్నీ, ధ‌నుష్, కొర‌టాల‌ కాంబినేష‌న్ నిజ‌మేనా?

బన్నీ, ధ‌నుష్, కొర‌టాల‌ కాంబినేష‌న్ నిజ‌మేనా?

Crazy Combination: ‘మిర్చి’ తో ద‌ర్శ‌కుడిగా మారి తొలి ప్ర‌య‌త్నంలోనే బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. ఆ త‌ర్వాత శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్, భ‌ర‌త్ అనే నేను.. ఇలా వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్స్ సాధించి సంచ‌ల‌నం సృష్టించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య అనే సినిమాని తెర‌కెక్కించారు. ఇందులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషించారు. ఈ భారీ, క్రేజీ మూవీ ఏప్రిల్ 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. కొర‌టాల శివ.. బ‌న్నీ, ధ‌నుష్ కాంబినేష‌న్లో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అల్లు అర్జున్ తో కొర‌టాల ఎప్ప‌టి నుంచో సినిమా చేయాలి అనుకుంటున్నారు కానీ.. సెట్ కావ‌డం లేదు. ఈసారి మాత్రం ఎలాగైనా స‌రే.. అల్లు అర్జున్ తో సినిమా చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. అయితే.. టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ క‌లిసి సినిమా చేస్తే.. ఈ క్రేజే వేరు. కొర‌టాల ఆచార్య త‌ర్వాత ఎన్టీఆర్ తో మూవీ చేయ‌నున్నారు. ఇది పూర్తైన త‌ర్వాత ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ను స్టార్ట్ చేస్తార‌ని టాక్ వినిపిస్తోంది. అయితే.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త వాస్త‌వ‌మేనా..?  కాదా..?  అనేది తెలియాల్సివుంది.

Also Read :  ‘కృష్ణ వ్రి౦ద విహారి’ పెద్ద హిట్ అవ్వాలి: అనిల్ రావిపూడి

RELATED ARTICLES

Most Popular

న్యూస్