Tuesday, January 21, 2025
Homeస్పోర్ట్స్FIH Odisha Hockey:  కొరియా విజయం; బెల్జియం-జర్మనీ మ్యాచ్ డ్రా

FIH Odisha Hockey:  కొరియా విజయం; బెల్జియం-జర్మనీ మ్యాచ్ డ్రా

పురుషుల వరల్డ్ కప్ హాకీ -2023లో భాగంగా పూల్ ‘బి’ జట్ల మధ్య నేడు జరిగిన రెండు మ్యాచ్ లలో జపాన్ పై కొరియా విజయం సాధించగా, జర్మనీ-బెల్జియం మధ్య జరిగిన మ్యాచ్ డ్రా గా ముగిసింది.

భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో ఈ రెండు మ్యాచ్ లు జరిగాయి. కొరియా- జపాన్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో రెండో నిమిషంలో జపాన్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచి స్కోరు బోణీ కొట్టింది. 9, 24 నిమిషాల్లో కొరియా  రెండు ఫీల్డ్ గోల్స్ చేసింది. ఈ రెండూ లీ జుంగ్ జూన్ చేయడం విశేషం. ద్వితీయార్ధంలో రెండు జట్లూ గోల్స్ చేయలేకపోయాయి.

లీ జుంగ్ జూన్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది

బెల్జియం-జర్మనీ మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో 10వ నిమిషంలో బెల్జియం తొలి గోల్ చేసింది. 23,53 నిమిషాల వద్ద జర్మనీ రెండు గోల్స్ చేసింది వీటిలో ఒకటి ఫీల్డ్, మరొకటి పెనాల్టీ స్ట్రోక్ ఉన్నాయి. అయితే 55 వ నిమిషంలో బెల్జియం ఆటగాడు వెగ్నేర్ విక్టర్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ చేసి స్కోరు సమం చేశాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్