Sunday, January 19, 2025
HomeTrending Newsదేవుళ్ళతో రాజకీయమా?:  కొట్టు ఫైర్

దేవుళ్ళతో రాజకీయమా?:  కొట్టు ఫైర్

దేవుళ్ళతో చెలగాటం ఆడటం బిజెపికి అలవాటుగా మారిందని, పండుగలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. వినాయక చవితి ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా తాము ఎలాంటి అంక్షలూ విధించలేదని అయన స్పష్టం చేశారు.

స్వాతంత్ర్య ఉద్యమంలో ఐక్యత కోసం మొదలు పెట్టిన వేడుక ఈ గణపతి నవరాత్రులు అని, నాటి నుంచి రాష్ట్రంలో కూడా గ్రామ గ్రామానా ఉత్సవాలు చేసుకునే ఆనవాయితీ ఉందన్నారు.  ప్రజలను తప్పుదోవ పట్టించడానికే బిజెపి, టిడిపిలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. వారు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఎక్కడా నిబంధనలు  లేవని వెల్లడించారు. గత ప్రభుత్వ హయంలో వసూలు చేసిన కరెంట్ చార్జీలను తమ హయంలో తగ్గించామన్నారు. గతంలో బాబు పాలనలో 44 దేవాలయాలు పడగొట్టినప్పుడు బిజెపి నేతలు ఏం ఆందోళన చేశారని ప్రశ్నించారు. తాము ఎక్కడ చిన్న సంఘటన జరిగినా వెంటనే  స్పందిస్తున్నామన్నారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు.

అందరూ ఆనందంగా వినాయకుణ్ణి పూజించాలని, విఘ్నాలు తొలగి పోవాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందని, ఆ గణనాథుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆశిస్తున్నామన్నారు.  సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసినంత మత్రాల ప్రజలు నమ్మరని ధీమా వ్యక్తం చేశారు.

Also Read : చర్చకు రండి: వైసీపీకి సోము సవాల్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్