Saturday, January 18, 2025
Homeసినిమాకృష్ణవంశీ నుంచి ఈసారి వచ్చేది లవ్ స్టోరీనే!

కృష్ణవంశీ నుంచి ఈసారి వచ్చేది లవ్ స్టోరీనే!

కృష్ణవంశీ .. క్రియేటివ్ డైరెక్టర్. కృష్ణవంశీ తరువాత చాలామంది దర్శకులు  ఇండస్ట్రీకి పరిచయ మయ్యారు. వరుస హిట్లను ఇస్తూ వెళుతున్న యువదర్శకులు ఉన్నారు. ఈ లోగా కృష్ణవంశీ నుంచి వరుస ఫ్లాపులు కూడా వచ్చాయి. అయినా క్రియేటివ్ డైరెక్టర్ అంటే కృష్ణవంశీనే.  అందుకు కారణం, కాలం .. కథలు కలిసిరాకపోవడం వల్లనే ఆయనకి  హిట్లు పడటం లేదు .. ఆయన టాలెంట్ గురించి శంకించవలసిన అవసరం లేదని ఆడియన్స్ అనుకోవడమే. ఈ కారణంగానే పేరు ప్రస్తావించకపోయినా, క్రియేటివ్ దర్శకుడు అనగానే అంతా ఆయనే అనుకుంటారు.

అలాంటి కృష్ణవంశీ మార్కెట్ కి తగినట్టుగా తన అభిరుచిని మార్చుకునే ప్రయత్నం చేయలేదు. తన మనసుకి నచ్చిన కథలనే ఎంచుకుంటూ వెళుతున్నాడు. ఆమధ్య ఆయన నుంచి వచ్చిన ‘రంగమార్తాండ’ వసూళ్ల విషయం అలా ఉంచితే, ఆ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోనివారు లేరు. హృదయానికి హత్తుకునే సన్నివేశాలకి మాత్రమే కన్నీళ్లు పెట్టించే సామర్థ్యం ఉంటుంది. కన్నీళ్లు పెట్టించిన దర్శకుడు సక్సెస్ అయినట్టే. అలాంటి కృష్ణవంశీ నుంచి ఈ సారి ఎలాంటి కంటెంట్ రానుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈసారి ఆయన నుంచి లవ్ స్టోరీ రానున్నట్టుగా సమాచారం. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను కదిలించే ప్రేమకథలు గానీ .. ఇప్పటి యూత్ కు కనెక్ట్ అయ్యే ప్రేమకథలు గాని రాలేదు. అందువలన కృష్ణవంశీ ఒక ప్రేమకథను రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ముగ్గురు యువకులు .. ముగ్గురు యువతుల మధ్య ఈ ప్రేమకథ నడుస్తుందని చెబుతున్నారు. ప్రేమకీ .. ఆకర్షణకి మధ్య ఉన్న తేడా ఏమిటి? మోడ్రన్ ప్రేమ కథలు ఎలా మొదలై .. ఎలా ముగుస్తున్నాయి? అనే ఒక కాన్సెప్ట్ తో ఈ సినిమా నడుస్తుందని అంటున్నారు. కొత్తవాళ్లతో ఆయన ఈ సినిమా చేయనున్నాడని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్