Saturday, January 18, 2025
Homeసినిమాకృష్ణంరాజు చేతుల మీదుగా ‘కళ్యాణమస్తు’ పాట

కృష్ణంరాజు చేతుల మీదుగా ‘కళ్యాణమస్తు’ పాట

Krishnam Raju Released First Song From Kalyanamastu Movie :

ఎస్ఎంఎస్ క్రియేషన్స్, బోయపాటి అగస్త్య ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో తెరకెక్కిన చిత్రం ‘కల్యాణమస్తు’. శేఖర్ వర్మ, వైభవి రావ్ హీరో హీరోయిన్లుగా లవ్, యాక్షన్ చిత్రంలోని మొదటి లిరికల్ సాంగ్ ను రెబల్ స్టార్ కృష్ణంరాజు విడుదల చేశారు. ఒ.సాయి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను బోయపాటి రఘుబాబు నిర్మించారు. ఆర్డీ ధ్రువన్ సంగీతం అందించిన ఈ సినిమాకు మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రఫీ అందించారు.

యంగ్ టీమ్ కలిసి చేసిన ‘కళ్యాణమస్తు’ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నిర్మాత బోయపాటి రఘుబాబు గారు సినిమాను బాగా తీశారని తెలుస్తుంది. నీవల్ల.. నీవల్ల.. సాంగ్ చాలా బాగుంది. ముఖ్యంగా యువతకు బాగా నచ్చేవిధంగా ఉంది. ఈ చిత్రంతో మా శేఖర్ కి హీరోగా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా సక్సెస్ అయ్యి అందరికి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా” అని కృష్ణంరాజు అన్నారు.

కృష్ణంరాజు భార్య శ్యామల దేవి “కళ్యాణమస్తు టైటిల్  చాలా బాగుంది,  రమ్య బెహర్ పాడిన పాట చాలా బాగుంది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ఇవి కూడా చదవండి: ప్రపంచ మార్కెట్ ను ఆక్రమించిన ప్రభాస్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్