Monday, February 24, 2025
Homeసినిమా'ది వారియర్'తో కోలీవుడ్ తెరకి కోలకళ్ల పిల్ల! 

‘ది వారియర్’తో కోలీవుడ్ తెరకి కోలకళ్ల పిల్ల! 

Kollywood Krithi: కృతి శెట్టి .. టాలీవుడ్ లో ఇప్పుడు ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ కోలకళ్ల సుందరి అందాల ‘ఉప్పెన’లా కుర్ర హృదయాలపై విరుచుకుపడింది. ‘శ్యామ్ సింగ రాయ్’లో మోడ్రన్ గాళ్ గా మెరిసిన ఈ అమ్మాయి, ‘బంగార్రాజు’లో గ్రామీణ నేపథ్యంతో కూడా పాత్రలో బంతిపువ్వులా విరిసింది. టాలీవుడ్ లోకి అడుగుపెడుతూనే హ్యాట్రిక్ హిట్ కొట్టేసిన కృతి, ఆ తరువాత ప్రాజెక్టులుగా మూడు సినిమాలను లైన్లో పెట్టింది. ఆ మూడు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే థియేటర్లకు రానుండటం విశేషం.

ముందుగా రామ్ జోడీగా కృతి నటించిన ‘ది వారియర్’ ఈ నెల 14వ తేదీన  ప్రేక్షకుల ముందుకు రానుంది. లింగుసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోను అదే రోజున రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతోనే కృతి శెట్టి కోలీవుడ్ కి పరిచయమవుతోంది. తమిళంలో సూర్య సరసన చేసే అవకాశం .. శివ కార్తికేయన్ జోడీ కట్టే ఛాన్స్ కృతి శెట్టికి వచ్చినట్టుగా వార్తలు షికారు చేశాయి. దాంతో సూర్యతో చేసే సినిమాతోనే కోలీవుడ్ లో ఆమె పరిచయం జరిగిపోతుందని అనుకున్నారు. కానీ రామ్ జోడీగా ఆమె అక్కడి ప్రేక్షకుల ముందుకు వెళుతోంది.

ఇక మరో తమిళ దర్శకుడైన వెంకట్ ప్రభు సినిమాలోను కృతి శెట్టి కనిపించనుంది. నాగచైతన్య హీరోగా వెంకట్  ప్రభు రూపొందిస్తున్న సినిమాలో ఆమె ఛాన్స్ కొట్టేసింది. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమా విడుదల కానుండటం కృతికి మరింత కలిసిరానుంది. ‘ది వారియర్’ తమిళంలో హిట్ అయితే అక్కడ ఆమె బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  ఇప్పటికే ఇక్కడి యంగ్ హీరోలంతా తమన ప్రాజెక్టులలో కృతిని తీసుకోమని మేకర్స్ పై వత్తిడి చేస్తున్నారని టాక్. రేప్పొద్దున ఇదే పరిస్థితి కోలీవుడ్ లో తలెత్తినా ఆశ్చర్యం లేదు.

Also Read : కృతి శెట్టి కున్న భయం ఏమిటి?

RELATED ARTICLES

Most Popular

న్యూస్