Saturday, January 18, 2025
HomeTrending Newsచైతు, సమంత మూవీలో కృతి శెట్టి..?

చైతు, సమంత మూవీలో కృతి శెట్టి..?

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ కృతిశెట్టి. ఈ సినిమా రిలీజ్ కాకుండానే వరుసగా ఆఫర్స్ అందుకుంది. ఉప్పెన రిలీజ్ కావడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో కృతి శెట్టికు మరింత క్రేజ్ పెరిగింది. ఉప్పెన తర్వాత శ్యామ్ సింఘరాయ్, బంగార్రాజు చిత్రాలతో కూడా విజయాలు సాధించింది. ఆతర్వాత ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, వారియర్,  మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించడం ఆ సినిమాలు ప్లాప్ అవ్వడం జరిగింది. అయినప్పటికీ.. ఈ అమ్మడు వరుసగా ఆఫర్స్ అందుకుంటుంది.

ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి కస్టడీ అనే సినిమాలో నటిస్తుంది. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగు, తమిళ్ లో రూపొందుతోంది. ఇందులో నాగచైతన్య కానిస్టేబుల్ గా నటిస్తున్నారు. నాగచైతన్య, కృతిశెట్టి కలిసి బంగార్రాజు సినిమాలో నటించారు. ఆ సినిమా సక్సెస్ సాధించడంతో ఈ జంట కలిసి మరో సక్సెస్ సాధిస్తారని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. తాజాగా కృతి శెట్టి మరో ఆఫర్ అందుకుంది. విజయ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న ఖుషి సినిమాలో కృతి శెట్టి ఓ కీలక పాత్ర పోషిస్తుంది.

లైగర్ మూవీ పెద్ద డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ ఖుషి మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రానికి నిన్నుకోరి, మజిలీ, టక్ జగదీష్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న టైమ్ లో విజయ్, సమంత సినిమాలో నటించే ఛాన్స్ రావడంతో ఈ ఉప్పెన బ్యూటీ తెగ ఖుషి అవుతుంది. మరి.. నాగచైతన్యతో చేస్తున్న మూవీ, విజయ్, సమంతతో చేస్తున్న ఖుషి చిత్రాలతో మళ్లీ కృతి శెట్టి ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి.

Also Read :  ఖుషి రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన విజయ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్