Friday, February 28, 2025
HomeసినిమాKrithi Shetty: కృతి శెట్టికి ఇది కీలకమైన సమయమే!

Krithi Shetty: కృతి శెట్టికి ఇది కీలకమైన సమయమే!

కృతి శెట్టి .. తెలుగు కుర్రాళ్లకు పరిచయమే అవసరం లేని పేరు. ‘ఉప్పెన’ సినిమాతో ఆమె ఒక ఉప్పెన మాదిరిగానే తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. టీనేజ్ లోనే తెలుగు తెరపై అడుగుపెట్టిన ఈ బ్యూటీని చూసి మనసులు పారేసుకోని కుర్రాళ్లు లేరు. చక్కని స్మైల్ తోనే అందరి హృదయాలను పొలోమంటూ పడగొట్టేసింది. ఫస్టు మూవీతోనే 100 కోట్ల హీరోయిన్ అనే పేరు తెచ్చుకుంది. ఆ తరువాత చేసిన రెండు సినిమాలు కూడా భారీ వసూళ్లను సాధించినవే.

టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూనే వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న హీరోయిన్స్ చాలా తక్కువ మంది. అలాంటి అరుదైన రికార్డు ఉన్న కథానాయికల జాబితాలో కృతి శెట్టి చేరిపోయింది. అమ్మాయిది గోల్డెన్ లెగ్ అనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపించింది. అయితే ఆ తరువాతనే కృతి పరాజయాల ప్రయాణం మొదలైంది. పెద్ద బ్యానర్లు .. స్టార్ హీరోలతోనే తరువాత సినిమాలు కూడా చేసింది. అయితే కథాకథనాల పరంగా ఆ సినిమాలు ఆదరణ పొందలేక పోయాయి.

ఈ నేపథ్యంలోనే ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘కస్టడీ’ రెడీ అవుతోంది. చైతూ హీరోగా వెంకట్ ప్రభు ఈ సినిమాను రూపొందించాడు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమా మే 12వ తేదీన విడుదలవుతోంది. ఇంతకుముందే ‘ది వారియర్’ సినిమాతో ఆమె తమిళ ప్రేక్షకులకు పరిచయమై, అక్కడ కూడా గ్లామర్ పరంగా మంచి మార్కులను సంపాదించుకుంది. వరుస ఫ్లాపులతో ఉన్న కృతికి ‘కస్టడీ’ హిట్ చాలా అవసరమే. ఆమె గ్రాఫ్ ను ఈ సినిమా ఎంతవరకూ పెంచుతుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్