Saturday, January 18, 2025
Homeసినిమాఈ అమ్మాయి ఈసారి హిట్టు కొట్టాలి!

ఈ అమ్మాయి ఈసారి హిట్టు కొట్టాలి!

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఎంట్రీ ఇస్తూనే 100 కోట్ల సినిమా కథానాయికగా కృతి శెట్టి మంచి మార్కులను కొట్టేసింది.  యూత్ కి ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో కనెక్ట్ అయిన కథానాయిక లేదు. పాలరాతి బొమ్మలా కనిపిస్తూ .. అందమైన నవ్వుతో .. ఆకర్షణీయమైన కళ్లతో కుర్ర మనసులకు కునుకు లేకుండా చేసింది. ‘ఉప్పెన’ తరువాత ‘శ్యామ్ సింగ రాయ్’ .. ‘బంగార్రాజు’ సినిమాలతో ఈ బ్యూటీ హ్యాట్రిక్ హిట్ అందుకుంది. అందంతో పాటు అదృష్టం కూడా మెండుగా ఉన్న కథానాయికగా అందరూ ఆమెను గురించి చెప్పుకున్నారు.

ఆ తరువాత కూడా కృతి శెట్టి సెలక్షన్ కి వంక బెట్టలేం. రామ్ .. నితిన్ వంటి మంచి క్రేజ్ ఉన్న హీరోల జోడీ కట్టింది.  రామ్ తో చేసిన ‘ది వారియర్’ .. నితిన్ తో చేసిన ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. నిజానికి ఈ రెండూ కూడా భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలే. ఈ రెండు సినిమాల కంటే ముందుగానే కృతి ఒప్పుకున్న సినిమా ఒకటుంది .. అదే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె సుధీర్ బాబు జోడిగా నటించింది.

అలాంటి ఈ సినిమా ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. మైత్రీ – బెంచ్ మార్క్ వారు కలిసి నిర్మించిన ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ అందరిలో ఆసక్తిని పెంచుతూ వచ్చాయి. కృతి పరంగా చూసుకుంటే ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టవలసిన అవసరం ఉంది. లేదంటే వరుసగా మూడు హిట్ల తరువాత మూడు  ఫ్లాపులను మూటగట్టుకున్నట్టు అవుతుంది. అంతేకాదు ఈ ఫ్లాపులను మరిపించడానికి దగ్గరలో ఆమె సినిమా మరొకటి లేదు. అందువలన ఆమె గ్రాఫ్ పుంజుకోవడానికి అవసరమయ్యే సినిమాగా దీనిని గురించి చెప్పుకోవాలి.

Also Read : నేను క‌నెక్ట్ అయ్యాను.. అంద‌రూ క‌నెక్ట్ అవుతారు : కృతి శెట్టి

RELATED ARTICLES

Most Popular

న్యూస్