Friday, October 18, 2024
Homeసినిమానక్కిన త్రినాధరావు విడుదల చేసిన 'క్షణం ఒక యుగం' ఫస్ట్ లుక్ పోస్టర్

నక్కిన త్రినాధరావు విడుదల చేసిన ‘క్షణం ఒక యుగం’ ఫస్ట్ లుక్ పోస్టర్

శ్రీ రూపా ప్రొడక్షన్ పతాకం పై మనీష్,మధు నందన్, లావణ్య, అక్సా ఖాన్, అలివియా ముఖర్జీ హీరో, హీరోయిన్స్ గా శివబాబు దర్శకత్వంలో రూప నిర్మించిన చిత్రం ‘క్షణం ఒక యుగం’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ క్షణం ఒక యుగం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా ‘క్షణం ఒక యుగం’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను డైరెక్టర్ నక్కిన త్రినాధరావు చేతుల మీదుగా గ్రాండ్ గా విడుదల చేశారు.

ఈ సందర్భంగా నక్కిన త్రినాధరావు మాట్లాడుతూ… వైజాగ్ లో ఉన్న నా ఫ్రెండు “క్షణం ఒక యుగం” సినిమా గురించి చెప్పడం జరిగింది. దాంతో నేను ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేయడానికి రావడం జరిగింది. పోస్టర్ చాలా బాగుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గెటప్ లో ఉన్న రూప పోస్టర్ ను చూడగానే ఇది పోలీస్ కథ అనుకున్నాను. కానీ శివ ఇది లవ్ స్టోరీ ఏ కానీ ఇందులోని కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్నారు. ఇందులో ఇద్దరు హీరోలు ముగ్గురు హీరోయిన్స్ కూడా నటించారని తెలిసింది. దర్శకుడు సూర్ల శివ బాబు మంచి కథను సెలెక్ట్ చేసుకొని చాలా బాగా చేశాడు.

తనకు ఈ సినిమా తర్వాత బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ వారు తీసిన సినిమా కొంత సక్సెస్ అయినా కూడా వెనక్కి వెళ్లకుండా మళ్ళీ కొత్త సినిమాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి అలాంటి వారిని ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ సినిమా ద్వారా కొత్త వారిని ఒక ప్లాట్ ఫామ్ మీదకు తీసుకు వచ్చి ఎంకరేజ్ చేయడానికి ముందుకు వచ్చిన నిర్మాత రూప గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. ఇక ముందు కూడా రూప టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేస్తూ తను ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్