Thursday, May 22, 2025
HomeTrending NewsCM Jagan: సిఎంను కలిసిన క్షత్రియ ఫెడరేషన్

CM Jagan: సిఎంను కలిసిన క్షత్రియ ఫెడరేషన్

ఏపీ క్షత్రియ ఫెడరేషన్‌ ప్రతినిధి బృందం తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  నూతనంగా ఏర్పాటైన జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడంపై ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన క్షత్రియ ఫెడరేషన్‌ ప్రతినిధులు,  ఏపీ క్షత్రియ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి పేద క్షత్రియులను ఆదుకుంటున్నందుకు వారి తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు సేవాసమితి పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తాము ఏపీ క్షత్రియ ఫెడరేషన్‌ను ఏర్పాటుచేసి మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు సీఎంకి  ప్రతినిధులు వివరించారు. ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.

 ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, ఏపీ క్షత్రియ ఫెడరేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటపతి రాజు, దాట్ల సత్యనారాయణ రాజు, ఏపీ క్షత్రియ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పాతపాటి శ్రీనివాసరాజు, క్షత్రియ ఫెడరేషన్‌ వైస్‌ ఛైర్మన్‌ టీవీఎస్‌ ఆంజనేయ రాజు, గాదిరాజు సుబ్బరాజు తదితరులు సిఎంను కలిసిన వారిలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్