Monday, February 24, 2025
Homeసినిమా‘క్షీరసాగర మథనం’ నాలుగు భాషల్లో అనువాదం

‘క్షీరసాగర మథనం’ నాలుగు భాషల్లో అనువాదం

Dubbing in 4 languages:
‘బిగ్ బాస్’ ఫేమ్ మానస్ నాగులపల్లి హీరోగా నటించిన ‘క్షీర సాగర మథనం’ చిత్రానికి తెలుగులో అసాధారణ విజయం లభించింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్నఈ చిత్రానికి ఇప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్ర కథానాయకుడు మానస్ నాగులపల్లి బిగ్ బాస్ కి సెలెక్ట్ కావడం, అందులో అత్యద్భుతంగా ఆడుతూ “టాప్-5″కి చేరడం “క్షీరసాగర మథనం” చిత్రానికి బాగా కలిసొచ్చింది.

ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్, అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర ఇతర ముఖ్య తారాగణంగా యువ ప్రతిభాశాలి అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మించింది. తమ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ఆడియన్స్ ఇప్పటికీ విశేషంగా ఆదరిస్తున్నారని, త్వరలోనే ఈ చిత్రాన్ని హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనువాదం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ద‌ర్శ‌కుడు అనిల్ పంగులూరి అన్నారు.

తమ హీరో మానస్ నాగులపల్లి బిగ్ బాస్ కి సెలెక్ట్ కావడమే కాకుండా అందులో అత్యద్భుతంగా ఆడుతూ లక్షలాదిమంది అభిమానం చూరగొనడం ‘క్షీరసాగర మథనం’ చిత్రం ఇంత ఘన విజయం సాధించడానికి కారణమయ్యిందని దర్శకుడు అనిల్ పంగులూరి తెలిపారు. మానస్ నాగులపల్లి బిగ్ బాస్ విజేతగా నిలవాలని మనసారా కోరుకుంటున్నామని, అందుకు నస్ అన్నివిధాల అర్హుడని అన్నారు.

Also Read : అమెజాన్ లో దూసుకెళ్తున్న క్షీర సాగర మథనం

RELATED ARTICLES

Most Popular

న్యూస్