Friday, March 28, 2025
HomeTrending Newsగత స్మృతుల్లో కేటియార్

గత స్మృతుల్లో కేటియార్

KTR- New York: తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అనేక ప్రపంచస్థాయి కంపెనీలను తెలంగాణకు తీసుకురావడంలో విజయం సాధించిన మంత్రి కేటీఆర్, తాను గతంలో చదువుకున్న న్యూయార్క్ నగరంలో తన విద్యార్థి, ఉద్యోగ జీవిత కాలానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన బిజీ షెడ్యూల్ మధ్యలో, ఫైజర్ సీఈఓతో సమావేశం ముగిసిన అనంతరం న్యూయార్క్ వీధుల్లో నడుచుకుంటూ తర్వాతి మీటింగ్ కి బయలుదేరారు.

తాను విద్యార్థిగా ఉన్నప్పుడు లెక్సింగ్టన్, 34 అవెన్యూలో గతంలో తాను తిన్న స్ట్రీట్ ఫుడ్ వద్దకు వెళ్లి తనకు అత్యంత ఇష్టమైన వేడి వేడి సాస్ తో కూడిన చికెన్ రైస్ ని కొని తిన్నారు. ఆ తర్వాత సమావేశానికి ఆలస్యం అవుతుండడంతో న్యూయార్క్ లో ఉండే ఎల్లో క్యాబ్ ఎక్కి వెళ్లారు.

ఉదయం నుంచి మంత్రితో ఉన్న తెలుగు ఎన్నారైలు, కేటీఆర్ ఒక సాధారణ వ్యక్తులా వరుసలో నిలబడి తన ఆహారం కొనుక్కోవడం, తర్వాత మీటింగ్ కి క్యాబ్లో వెళ్లడం వంటి విషయాలను చూసి ఆశ్చర్యపోయారు. ఆయన సింప్లిసిటీ కి, కమిట్మెంట్ కి అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్