Sunday, January 19, 2025
HomeసినిమాSamantha: సమంత క్రేజ్ ను డిసైడ్ చేసే 'ఖుషి'

Samantha: సమంత క్రేజ్ ను డిసైడ్ చేసే ‘ఖుషి’

సమంతకి తెలుగు .. తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. స్టార్ హీరోలందరి సరసన ఒకటికి రెండు మార్లు చుట్టబెట్టేసింది. ఇక హీరోయిన్ ఓరియెంటెడ్ కథల్లోను తాను ఏమిటనేది నిరూపించుకుంది.ఆ దిశగా ఆమె చేసిన ‘యూ టర్న్’ .. ‘ఓ బేబి’ .. ‘యశోద’ సినిమాలు సక్సెస్ గ్రాఫ్ లో దూసుకుపోయాయి. అయితే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన హీరోయిన్స్ నుంచి రొమాన్స్ ను ఆడియన్స్ ఎక్కువగా ఆశించారు. ఎందుకంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో వారు ఫైట్స్ చేయవలసి వస్తుంది.

అంతగా ఫైట్స్ లో రెచ్చిపోయిన హీరోయిన్స్ ను అందమైన .. అమాయకమైన హీరోయిన్స్ గా చూడటానికి ఆడియన్స్  పెద్దగా ఆసక్తిని చూపించరు. సమంత విషయంలోను అదే జరిగిందేమోనని అనిపిస్తూ ఉంటుంది. ‘యశోద’ సినిమాలో ఆమె యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. ఇక ఆ సినిమాకి కాస్త అటు ఇటుగా ఆమె చేసిన వెబ్ సిరీస్ లు కూడా సమంతలోని వేరే కోణాలను ఆవిష్కరించాయి. ఆ ఎఫెక్ట్ ‘శాకుంతలం’ మీద పడిందా అంటే .. పడిందనే చెప్పాలి.

‘శాకుంతలం’ సినిమాలో సమంతను ఒక శృంగార నాయికగా ప్రేక్షకులు అంగీకరించలేకపోయారు. దుష్యంతుడిగా దేవ్ మోహన్ ను ఒప్పుకున్నారుగానీ, శకుంతల పాత్రలో సమంతను అంగీకరించలేదు. దాంతో ఆ సినిమా పరాజయం పాలైంది. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన సమంత ‘ఖుషి’ సినిమా చేసింది. జోడీ పరంగా ప్రేక్షకుల్లో ఆశించిన స్థాయి ఉత్సాహం మాత్రం కనిపించడం లేదు. మరి కథా పరంగా .. పాత్రల పరంగా శివ నిర్వాణ ఒప్పిస్తాడేమో చూడాలి. ఇకపై సమంతకి ఈ తరహా కథలు ఎంతవరకూ వర్కౌట్ అవుతాయనేది ఈ సినిమా తేల్చేయనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్