Saturday, January 18, 2025
Homeసినిమాఖుషి రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన విజయ్

ఖుషి రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన విజయ్

విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పూరి దర్శకత్వంలో రూపొందిన మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. దీంతో నెక్ట్స్ మూవీస్ విషయంలో విజయ్ దేవరకొండ చాలా కేర్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఖుషి’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన సమంత నటిస్తుంది. ఇది విభిన్న ప్రేమకథా చిత్రం అవ్వడం.. ఈ చిత్రానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టడంతో ఖుషి మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఇప్పటి వరకు ఈ మూవీ 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నట్టుగా గతంలో ప్రకటించారు కానీ.. ఇప్పుడు డిసెంబర్ లో ఈ మూవీ రిలీజ్ కావడం లేదు. లైగర్ ప్లాప్ తర్వాత విజయ్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడం.. షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడం.. అలాగే సమంత అనారోగ్యం కారణంగా మరోసారి షూటింగ్ కి బ్రేక్ పడడంతో అనుకున్న విధంగా షూటింగ్ జరగలేదు. దీంతో ఖుషి వాయిదా పడిందని వార్తలు వచ్చాయి కానీ.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు.

ఇప్పుడు విజయ్ ఖుషి మూవీ పై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో హీరో విజయ్ దేవరకొండ, మొదట మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. అయితే కొన్ని కారణాల వలన రిలీజ్ మరొక మూడు నెలలు పొడిగింపబడిందని అన్నారు. దాని ప్రకారం వచ్చే ఏడాది అనగా 2023 ఫిబ్రవరిలో ఖుషి మూవీని రిలీజ్ చేస్తాం అని చెప్పారు. ఈ సినిమా పై విజయ్ దేవరకొండ చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి.. లైగర్ తో మిస్ అయిన బ్లాక్ బస్టర్ ఖుషి మూవీతో వస్తుందేమో చూడాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్