Coal Mine Explosion: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బొగ్గు గనుల తవ్వకాల్లో నియమనిబంధనలు గాలికి వదిలేశారు. ఓపెన్ కాస్ట్ గనులతో ప్రమాదం అని తెలిసినా పాలకులు… మైనింగ్ సంస్థలతో కుమ్మక్కై అనుమతులు ఇస్తున్నారు. గనుల తవ్వకాల సమయంలో మైనింగ్ సంస్థలు పరిసర ప్రాంతాల ప్రజలు, గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చిన తర్వాతనే పేలుళ్లు నిర్వహించాలి. అయితే అటవీ గ్రామాల ప్రజలకు అవగాహనా లేకపోవటంతో మైనింగ్ సంస్థలు తమకు ఎప్పుడు వీలైతే అప్పుడు సమయంతో సంబంధం లేకుండా గనుల తవ్వకాల కోసం పేలుళ్లు చేపడుతున్నారు.
తాజాగా కోర్బా జిల్లాలోని కుస్ముండా ఉపరితల బొగ్గు గనిలో పేలుళ్ళు పరిసర ప్రాంతాల ప్రజలను భయ కంపితులను చేస్తున్నాయి. యాక్షన్ సినిమా తరహాలో వరుసగా జరిపిన పేలుళ్లతో ఆ ప్రాంతం అంతా పొగ అలుముకుంది. ఏం జరుగుతోందో తెలియని సమీప గ్రామాల ప్రజలు భయాన్దోలనకు గురయ్యారు. ఈ ఘటనతో అటవీ గ్రామాల ప్రజలు ఇల్లు విడిచి అడవిలోకి పరుగులు తీశారు. పేలుళ్ళ ధాటికి పెద్ద పెద్ద బండరాళ్ళు సమీప గ్రామాల్లో పడుతున్నాయి.
ఓ వైపు పోలీసులు – నక్సల్స్ మధ్య కాల్పులు… కూంబింగ్ లతో అల్లాడుతున్న ఛత్తీస్‌గఢ్ అటవీ గ్రామాలకు ఓపెన్ కాస్ట్ మైనింగ్ తో కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఆలస్యంగా వెలుగు చుసిన కుస్ముండా బొగ్గు గని పేలుడుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read: ఛత్తీస్‌గఢ్‌లో మావోల మెరుపు దాడి