Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఇంగ్లాండ్ ఓపెన్: సేన్ గెలుపు; సింధు, సైనా ఓటమి

ఇంగ్లాండ్ ఓపెన్: సేన్ గెలుపు; సింధు, సైనా ఓటమి

All England Open: పివి సింధు మరోసారి నిరాశ పరిచింది. అల్ ఇంగ్లాండ్ ఓపెన్ 2022 టోర్నీలోకూడా రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. నేడు జరిగిన మహిళల సింగిల్స్ లో సింధుతో పాటు సైనా కూడా ఓటమి పాలయ్యింది. పురుషుల సింగిల్స్ లక్ష్య సేన్ విజయం సాధించి ప్రీ క్వార్టర్స్ లో అడుగు పెట్టాడు. మహిళల, పురుషుల డబుల్స్ లో మన జట్లు తర్వాతి రౌండ్ కు  ప్రవేశించాయి.

మహిళల సింగల్స్ లో
సైనా నెహ్వాల్ 21-14; 17-21; 21-17తో జపాన్ కు చెందిన అకానే యమగుచి చేతిలో ఓటమి పాలైంది.
పివి సింధుపై జపాన్ క్రీడాకారిణి సయాకా తకహషి 21-19; 16-21; 21-17 తో విజయం సాధించింది.

పురుషుల సింగల్స్ లో
లక్ష్య సేన్ 21-16; 21-18 తో డెన్మార్క్ ఆటగాడు అండర్స్ అంటోన్ సేన్ పై విజయం సాధించాడు.
కిడాంబి శ్రీకాంత్ పై  9-21; 21-18;21-19 tho ఇండోనేషియా ప్లేయర్ అన్తోనియా సినిసికా గెంటింగ్ గెలుపొందాడు.

పురుషుల డబుల్స్ లో..
సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి ద్వయం 21-7; 21-7తో జర్మనీ ద్వయం మార్క్ లామ్స్ ఫస్- మార్విన్ సీడేల్ పై ఘన విజయం సాధించారు.

మహిళల డబుల్స్ లో..
త్రెసా జాలీ – గాయత్రీ గోపీచంద్ పుల్లెల జోడీ 18-21; 19-14 (రిటైర్డ్) తో ఇండోనేషియా ద్వయం గ్రేషియా పోలీ-అప్రియాని రహయుపై విజయం సాధించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్