Sunday, February 23, 2025
Homeస్పోర్ట్స్ఇంగ్లాండ్ ఓపెన్: ఫైనల్లో లక్ష్య సేన్

ఇంగ్లాండ్ ఓపెన్: ఫైనల్లో లక్ష్య సేన్

Sen into Finals:  అల్ ఇంగ్లాండ్ ఓపెన్ 2022 టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్య సేన్ ఫైనల్ చేరాడు. నేడు జరిగిన సెమీస్ లో మలేషియా ఆటగాడు లీ జీ జియాపై 21-13; 12-21; 21-19 తో విజయం సాధించాడు. తొలి సెట్ ఈజీగా గెల్చుకున్న సేన్ రెండో సెట్ అదే స్థాయిలో కోల్పోయాడు. మోడో సెట్ లో ఒక దశలో 11-16 తో వెనుకబడినా పుంజుకొని చివర్లో తన మేజిక్ ప్రదర్శించి గట్టెక్కాడు.

ఈ అర్ధరాత్రి  వరల్డ్ నంబర్ వన్, ఫోర్త్ ర్యాంకుల్లో కొనసాగుతున్న విక్టర్ ఆక్సెల్ సేన్- చొ టీన్ చెన్ ల మధ్య జరిగే మ్యాచ్ విజేతతో రేపు జరిగే ఫైనల్లో లక్ష్య సేన్ తలపడనున్నాడు.

ఈ ఏడాది జరిగిన మొట్టమొదటి టోర్నీ సన్ రైజ్ ఇండియా ఓపెన్-2022 లో పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచిన సేన్, తర్వాత జరిగిన సయ్యద్ మోడీ టోర్నీకి కోవిడ్ కారణంగా దూరమయ్యాడు. మూడో టోర్నీగా గత వారం ముగిసిన జర్మన్ ఓపెన్ లో కూడా ఫైనల్ కు చేరిన లక్ష్య సేన్ కున్లావట్ చేతిలో పరాజయం పాలయ్యాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్