Tuesday, January 21, 2025
Homeస్పోర్ట్స్India Open-2023: సేన్, సైనా గెలుపు- సింధు ఓటమి

India Open-2023: సేన్, సైనా గెలుపు- సింధు ఓటమి

న్యూఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ హాల్ వేదికగా జరుగుతోన్న బ్యాడ్మింటన్ యోనెక్స్ సన్ రైజ్ ఇండియా ఓపెన్-2023లో తొలిరోజు ఇండియాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గతవారం ముగిసిన మలేషియా ఓపెన్ లో తొలిరౌండ్ లోనే ఓటమి పాలైన పివి సింధు ఈ టోర్నీలో కూడా తొలి రౌండ్ లోనే పరాజయం పాలైంది. థాయ్ లాండ్ ప్లేయర్ సుపనిద కటేతాంగ్ చేతిలో 21-14;22-20 తేడాతో ఓటమి పాలైంది.

పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ మన దేశానికే చెందిన హెచ్ ఎస్ ప్రణయ్ పై 21-14;21-15 తో గెలుపొందాడు.

మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్ 21-17; 12-21;21-19 తేడాతో డెన్మార్క్ ప్లేయర్ బ్లిచ్ ఫెల్ద్ట్ పై విజయం సాధించింది. తొలి సెట్ గెల్చుకున్న సైనా రెండో సెట్ కోల్పోయింది. మూడో సెట్ లో ఓ దశలో వెనుకబడిన సైనా తేరుకొని వరుస పాయింట్లతో ప్రత్యర్థిని మట్టికరిపించింది.

పురుషుల డబుల్స్ లో చిరాగ్ శెట్టి- సాత్విక్ సాయిరాజ్ జోడీ 21-13;21-15 తో స్కాట్లాండ్ జోడీ క్రిస్టోఫర్-మాథ్యూ గ్రిమ్లీ  పై…;  గరగ కృష్ణ ప్రసాద్- విష్ణు వర్ధన్ గౌడ్ జోడీ 21-11; 23-25; 21-9 తేడాతో నెదర్లాండ్స్ ద్వయం రూబెన్ జీలీ- టైస్ వాండర్ లపై గెలుపొంది రెండో రౌండ్ లో అడుగు పెట్టారు.

మహిళల డబుల్స్ లో త్రెసా జాలీ- గాయత్రి గోపీ చంద్ లు 22-20; 17-21; 21-18  తేడాతో ఫ్రెంచ్ జోడీ మర్గోట్ లాంబెర్ట్-అన్నే ట్రాన్ లను ఓడించి రెండోరౌండ్ లో ప్రవేశించగా…. మరో రెండు జోడీలు… శృతి మిశ్రా-సిక్కీ రెడ్డి; హరిత ఇష్నా రాయ్ లు తొలి రౌండ్ లోనే వెనుదిరిగారు.

మిక్స్డ్ డబుల్స్ లో ఇషాన్ భట్నాగర్ – తానీషా క్రాస్టో ఓటమి పాలయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్