Sunday, January 19, 2025
HomeTrending News90 వేల మెజార్టీతో వైసీపీ ఘనవిజయం

90 వేల మెజార్టీతో వైసీపీ ఘనవిజయం

landslide Victory For Ysrcp In Badvel By Election :

బద్వేల్ ఉపఎన్నికలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి డా.సుధ 90,533ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. మొత్తం 12 రౌండ్ల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం పూర్తయ్యింది. మొత్తం 1,47,213 ఓట్లు పోలయ్యాయి.పోస్టల్ బ్యాలెట్లతో డా. సుధకు 1,12,211 ఓట్లు రాగా, బిజెపి అభ్యర్ది సురేష్ కు 21,678 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కమలమ్మకు 6,235, నోటాకు 3650 ఓట్లు వచ్చాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సుధ 90,533 ఓట్ల మెజార్టీ పొందారు.

బద్వేల్ లో 2019 సాధారణ ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్యకు 44,734 ఓట్ల మెజార్టీ రాగా అయన సతీమణి, ప్రత్యర్ధి 90 వేల పైచిలుకు మెజార్టీ సాధించడం గమనార్హం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బద్వేల్ లో  లక్ష ఓట్ల మెజార్టీ రావాలని  పార్టీ నేతలకు సూచించారు. దానికి సమీపంలో 90 వేల ఆధిక్యంతో పార్టీ గెలుపొందింది. వైసీపీ ఘనవిజయంతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు నెలకొన్నాయి. మంత్రి వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్యే జోగి రమేష్ లు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచి పెట్టారు

Must Read :బద్వేల్ వైసీపీ అభ్యర్థిగా డా. సుధ

RELATED ARTICLES

Most Popular

న్యూస్