Sunday, January 19, 2025
HomeTrending Newsబురదలో చిక్కుకున్న వాహనాలు.. కొలంబియాలో 34మంది మృతి

బురదలో చిక్కుకున్న వాహనాలు.. కొలంబియాలో 34మంది మృతి

దక్షిణ అమెరికాలోని కొలంబియా దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడి బస్సు బురదలో కూరుకుపోయింది. కొండచరియలు విరిగిపడడంతో రహదారిపై వెళ్తున్న ఓ బస్సు పూర్తిగా బురదలో మునిగిపోయింది. మరో రెండు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. రిసరాల్డా జిల్లాలోని ప్లూబో రికో నగరంలో ఆదివారం సాయంత్రం ఈ ఘోర దుర్ఘటన జరిగింది. భారీగా బురద ఉప్పొంగటంతో రహదారి రెండుగా చీలిపోయింది. ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. రెండు మీటర్ల లోతులో బురదలో కూరుకుపోయిన బస్సులో మొత్తం 33 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సమచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.. సుమారు 70 మంది వరకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 24 గంటల పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు.

ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో ట్వీట్‌ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొద్ది రోజులుగా కొలంబియాలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ వ‌ర్షాల కార‌ణంగా కొండ ప్రాంతాల్లోని మ‌ట్టి దిబ్బ‌లు విరిగిప‌డి బుర‌ద‌గా మారుతున్నాయి. ఆదివారం సాయంత్రం బుర‌ద ఉప్పొంగ‌డంతో ఫ్యూబ్లో రికో, శాంటా సిసిలియా గ్రామాల మ‌ధ్య ర‌హ‌దారి రెండుగా చీలిపోయింది. అదే స‌మ‌యంలో అటుగా వ‌స్తున్న బ‌స్సును బుర‌ద ముంచెత్తింది. రెండు మీట‌ర్ల లోతులో బ‌స్సు కూరుకుపోయింది. ఈ ఘ‌ట‌న‌తో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్