Monday, September 23, 2024
Homeసినిమామహేష్‌ మూవీ గురించి సరికొత్త రూమర్

మహేష్‌ మూవీ గురించి సరికొత్త రూమర్

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ‘గుంటూరు కారం ‘అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో భారీ పాన్ వరల్డ్ మూవీ చేయనున్నాడు. ఈ క్రేజీ కాంబో మూవీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి కానీ.. ఎప్పుడు స్టార్ట్ కానుందో ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం రైటర్ విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా స్టార్ట్ కాకుండానే రూమర్స్ వస్తున్నాయి. ఆ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో హాలీవుడ్ నుంచి ఓ యంగ్ అండ్ స్టార్ హీరోయిన్ కనిపించనుంది రూమర్స్ మొదలయ్యాయి. ఇక దీనికి ముందే హాలీవుడ్ స్టార్ క్రిస్ హెమ్స్ వర్త్ ఈ సినిమాలో కనిపిస్తాడని కూడా పలు గాసిప్స్ వచ్చాయి. అయితే.. ప్రస్తుతానికి ఏది కూడా వాస్తవం కాదు కానీ ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కి హాలీవుడ్ హంగులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయని తెలిసింది. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుంది. ఆగష్టు 9న మహేష్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటిస్తారని టాక్ వినిపిస్తుంది.

ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి పేరు హాలీవుడ్ లో బాగా వినిపించింది. నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కించుకోవడంతో హాలీవుడ్ మేకర్స్ రాజమౌళిని అభినందించారు. అలాగే హాలీవుడ్ లో సినిమా చేయాలి అనుకుంటే చెప్పండి అంటూ రాజమౌళికి ఆఫర్స్ ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో మహేష్ బాబుతో చేసే సినిమా పాన్ వరల్డ్ మూవీగా కనీవినీ ఎరుగని రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్