Sunday, January 19, 2025
Homeసినిమాజూలై 15న లావణ్య త్రిపాఠి 'హ్యాపీ బర్త్‌డే'

జూలై 15న లావణ్య త్రిపాఠి ‘హ్యాపీ బర్త్‌డే’

HBD: ‘మత్తు వదలరా ‘చిత్రంతో ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే‘. ప్రముఖ కథానాయిక లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తుంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గుండు సుదర్శన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు చిత్ర నిర్మాతలు. విడుదల తేదీతో కూడిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ కూడా అందర్ని ఆకట్టుకుంటుంది. చేతిలో గన్స్‌తో ఎగురుతున్నట్లు లావణ్యత్రిపాఠి ఈ పోస్టర్‌లో కనిపించడంతో అందరిలోనూ ఈ చిత్ర కథ పై ఆసక్తి పెరిగింది. ఈ పోస్టర్ చూస్తే మాత్రం తప్పకుండా ఇది రితేష్ రానా దర్శకత్వంలో రానున్న మరో వినూత్న హిలేరియస్ ఎంటర్‌టైన్‌ర్‌గా కనిపిస్తుంది.

Also Read : ‘హ్యాపీ బర్త్ డే’ మూవీ నుంచి సత్య ఫస్ట్ లుక్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్