Tuesday, September 24, 2024
HomeTrending Newsచట్టబద్ధంగానే టీవీ 9 వాటాల కొనుగోలు

చట్టబద్ధంగానే టీవీ 9 వాటాల కొనుగోలు

Tv9 Shares : టీవీ 9 వాటాల కొనుగోలులో ఎలాంటి అవకతవకల్లేవని, అన్నీ చట్టబద్ధంగానే జరిగాయని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్ తీర్పు వెలువరించింది. వాటాలు కొనుగోలు చేసిన మైహోమ్‌ గ్రూప్‌ యజమానులు జూపల్లి జగపతిరావు. ఇతర డైరెక్టర్లను ఇబ్బంది పెట్టడానికి మాజీ సీఈవో రవిప్రకాష్, ఇతరులు ఈ పిటీషన్‌ వేశారని బెంచ్‌ అభిప్రాయపడింది. అందువల్ల ప్రతివాదులకు రూ .10 లక్షలు చెల్లించాలని రవిప్రకాష్. కె.వి.ఎన్.మూర్తిలను ఆదేశించింది. టీవీ9కు చెందిన ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ వాటాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, సంస్థను స్వాధీనం చేసుకున్నవారిని నియంత్రించాలని కోరుతూ ఛానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ ,కె.వి.ఎన్.మూర్తిలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న ఎన్‌సీఎల్‌టీ నిన్న తీర్పు వెలువరించింది.

వాటాల విక్రయ ఒప్పందం రవిప్రకాశ్‌కు తెలిసే జరిగిందని, ఆ ప్రక్రియలో ఆయన భాగమేనని పేర్కొంది. టీవీ 9 ప్రమోటర్‌ అయిన ఏబీసీఎల్‌లో రవిప్రకాష్‌కు 9 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే. కంపెనీ నుంచి సీఈఓ అంటే రవిప్రకాష్‌, సీఎఫ్‌ఓ మూర్తిలను తొలగించడం కంపెనీల చట్టం అనుగుణంగానే జరిగిందని, ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదని బెంచ్‌ పేర్కొంది. కంపెనీ యాజమాన్యం బదిలీలో అవకతవకలు జరిగాయని పిటీషనర్‌ ఎక్కడా నిరూపించలేకపోయారని బెంచ్‌ అభిప్రాయపడింది. పిటీషనర్‌ వల్ల ప్రతివాది, టీవీ9ను కొనుగోలు చేసిన అలందా మీడియా, ఇతరులను అనసరమైన ఒత్తిడికి గురి చేశారంటూ పిటీషనర్‌ను రూ. 10 లక్షలు చెల్లించాలని ఆదేశించింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్