Friday, March 29, 2024
HomeTrending Newsహైదరాబాద్ లో ఢిల్లీ తరహా కాన్స్టిట్యూషన్ క్లబ్

హైదరాబాద్ లో ఢిల్లీ తరహా కాన్స్టిట్యూషన్ క్లబ్

అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులైనా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాల కోరినన్ని రోజులు సభను నడిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చర్చకు మేము 10 అంశాలు స్పీకర్ కి ఇచ్చాము. ఐటీ పరిశ్రమలు, హరిత హారం, వ్యవసాయం, దళిత బంధు లాంటివి ఇందులో ఉన్నాయన్నారు. బీజేపీని బీఏసీ కి పిలువాలా వద్దా అనేది స్పీకర్ నిర్ణయమని మంత్రి తెలిపారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం తర్వాత మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో అసెంబ్లీ లాంజ్ లో చిట్ చాట్ నిర్వహించారు.

ఈ దఫా జరిగే సమావేశాల్లో 4 లేదా 5 బిల్లులు ఉంటాయని, రెండు ఆర్డినెన్స్ ల స్థానం లో  పాస్ చేసేవి ఉన్నాయని మంత్రి వెల్లడించారు. MIM ఓల్డ్ సిటీ అభివృద్ధి కోసం చర్చించాలని కోరిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 12 అంశాలు ఇచ్చారు- 8అంశాలు చెప్పారన్నారు.

హైదరాబాద్ లో ఢిల్లీ తరహాలో కాన్స్టిట్యూషన్ (constitution) క్లబ్ కట్టాలని సీఎం అనుకుంటున్నారని మంత్రి చెప్పారు. పార్లమెంటు లో మాదిరి అసెంబ్లీలో కూడా కానిస్టిట్యూషన్ క్లబ్ ఏర్పాటు చేయాలి. తద్వారా నూతన సభ్యులకు మాజీ సభ్యులకు చర్చలకు, డిబేట్లు సెమినార్లు బోధనకోసం వేదికను కల్పించాలి. త్వరలోనే నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ సూచించారని మంత్రి చెప్పారు. తెలంగాణ శాసన సభ ఔన్నత్యాన్ని పెంచడానికి దేశానికే ఆదర్శంగా నిలవడానికి తీసుకోవాల్సిన చర్యలను చేపట్టాలి. ప్రతిపక్ష నేతలు- శాసనసభ వ్యవహారాల మంత్రి ,ఆర్థిక మంత్రి పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ వెళ్లి అక్కడ పర్యటన చేయాలని స్పీకర్ ని సీఎం కోరారని తెలిపారు.

బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతి శుక్రవారం ప్రయివేట్ మెంబర్ బిల్లు పై చర్చ జరిగే అంశం పై పరిశీలించాలని సిఎం చెప్పారని, ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ శాసనసభ సమావేశాలు బాగా జరుగుతున్నాయని మంత్రి అన్నారు. హుజురాబాద్ లో మా సర్వే ప్రకారం టీ ఆర్ ఎస్ బీజేపీ కన్నా 15 శాతం ఎక్కువ ఓట్లు సాధించ బోతోందని, ఈటెల మా పై చేస్తున్న ఆరోపణలు నిరాధారం, ఈటెల నే హుజురాబాద్ లో ప్రలోభాలకు తెర లేపారని మంత్రి విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్