Sunday, January 19, 2025
Homeసినిమావిజయ్, శంకర్ ప్రాజెక్ట్ ఏమైంది..?

విజయ్, శంకర్ ప్రాజెక్ట్ ఏమైంది..?

శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో ‘ఇండియన్ 2’ సినిమా చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ తో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ రెండు చిత్రాల్లో ముందుగా ఇండియన్ 2 రిలీజ్ కానుంది. ఆతర్వాత గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కానుంది. అయితే.. ఈ రెండు చిత్రాల తర్వాత శంకర్ కోలీవుడ్ స్టార్ విజయ్ తో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా.. ఇప్పటికే పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీని విజయ్ కి నెరేట్ చేశారని.. త్వరలో ఈ సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని ప్రచారం జరిగింది.

ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. ఇంతకీ విషయం ఏంటంటే.. శంకర్ మూడు సార్లు విజయ్ కి స్క్రిప్ట్స్ చెప్పారట. 2014లో మల్టీ స్టారర్ కథని విజయ్ కి నెరేట్ చేశారట. విక్రమ్, విజయ్ కాంబినేషన్ లో ఆ మూవీ చేయాలని అనుకున్నారట కానీ.. సెట్ కాలేదు. ఆతర్వాత 2017లో ఒకే ఒక్కడు సీక్వెల్ కోసం స్టోరీ రెడీ చేసి విజయ్ కి చెప్పారట. దానికి కూడా అతను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. చివరిగా 2018లో ఓ సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ విజయ్ కి వినిపించారట. ఆ కథకి కూడా విజయ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట.

నిజానికి ఈ మూడు కథలు విజయ్ కి నచ్చినా.. ఎందుకో తనకి సెట్ కావనుకొని చేయలేదట. ఇప్పుడు శంకర్ నెరేట్ చేసిన పొలిటికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ కూడా విజయ్ కి నచ్చిందట. అయితే.. అతని నుంచి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదని తెలిసింది. విజయ్ త్వరలో రాజకీయ రంగప్రవేశం చేయాలి అనుకుంటున్నాడని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. శంకర్ చెప్పిన స్టోరీ కూడా పోలిటిలక్ థ్రిల్లర్ కావడంతో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుందని అనుకుంటున్నారు సినీజనాలు. అక్టోబర్ 19న లియో విడుదల కానుంది. ఆ సినిమా వర్క్ లో ఉన్నాడు విజయ్. మరి.. త్వరలో శంకర్ మూవీ పై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్