Sunday, January 19, 2025
Homeసినిమా'సలార్' రెండు పార్టులా..? ఒకటే పార్టా..?

‘సలార్’ రెండు పార్టులా..? ఒకటే పార్టా..?

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ, క్రేజీ మూవీ ‘సలార్‘. ఇందులో ప్రభాస్ కు జంటగా శృతి హాసన్ నటిస్తుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి సలార్ పై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ప్రభాస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సెప్టెంబర్ 28న సలార్ మూవీని విడుదల చేయనున్నట్టుగా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు సలార్ థియేటర్లోకి వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సలార్ మూవీని రెండు పార్టులుగా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ ఖండించలేదు.. అవును అని చెప్పలేదు. దీంతో సలార్ రెండు పార్టులా..? ఒకే పార్టా..? అనేది సస్పెన్స్ గా మారింది. అయితే.. ఇప్పుడు సలార్ ఒకే పార్టులా తీయాలా..? రెండు పార్టులుగా తీయాలా..? అనేది తేల్చుకోలేక టెన్షన్ పడుతున్నారట. ఇంతకీ విషయం ఏంటంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ నాటికి ప్రశాంత్ నీల్ సలార్ పని ముగించుకుని, ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేయాల్సివుంది. అదే విధంగా ప్రభాస్ తన లైనప్ లో వున్న సినిమాలు అన్నీ చకచకా పూర్తి చేయాల్సి వుంది.

ఇలాంటి టైమ్ లో అటు ప్రశాంత్ నీల్ కి. ఇటు ప్రభాస్ కి అన్ని విధాలా అనుకూలంగా వుండేలా సలార్ ను ఒక భాగంగానే చేస్తే ఎలా వుంటుందనే ఆలోచిస్తున్నారట. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా డిసెంబర్ లో మొదలు కావాలి అంటే సలార్ రెండు భాగాల పని నవంబర్ నాటికి పూర్తి కావాల్సి వుంటుంది. షూట్ పూర్తి అయినా, తొలి భాగం విడుదల చేసి, మళ్లీ మలి భాగం పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ పెద్ద ప్రాసెస్. అందువల్ల ఒక భాగంగా మారుస్తారా? లేక రెండు భాగాలుగానే వుంచి కాస్త టైమ్ తీసుకుని చేస్తారా..? అన్నది పక్కాగా క్లారిటీ లేదు. మరి.. త్వరలో సలార్ సీక్వెల్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read : ‘సలార్’ లో యశ్. ఇది నిజమేనా..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్