Sunday, January 19, 2025
Homeసినిమాజాన్వీ మనసు దోచుకున్న స్టార్ హీరో..?

జాన్వీ మనసు దోచుకున్న స్టార్ హీరో..?

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్.. టాలీవుడ్ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఎప్పుడు..? ఎవరితో సినిమా చేయనుంది అనేది మాత్రం క్లారిటీ లేదు. ‘వకీల్ సాబ్’ మూవీలో జాన్వీ అని టాక్ వచ్చింది. ఆతర్వాత ‘లైగర్’ మూవీలో జాన్వీ అంటూ వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్, చరణ్ సినిమాల్లో జాన్వీ నటించనున్నట్టుగా ప్రచారం జరిగింది కానీ.. అవేవీ నిజం కాలేదు. ఒకానొక దశలో జాన్వీకి తెలుగు సినిమాల్లో నటించడం ఇష్టం లేదేమో అనే వార్తలు కూడా వచ్చాయి. ఆ వార్తలను జాన్వీ ఫాదర్ బోనీ కపూర్ ఖండించారు.

అలాంటిది ఏమీ లేదు. తెలుగు సినిమాల్లో జాన్వీ కఫూర్ ఖచ్చితంగా నటిస్తుందని చెప్పారు. బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఆమె నుంచి బ్లాక్ బస్టర్ సినిమాలేవీ లేకపోయినా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అంతా తన గురించి మాట్లాడుకునేలా చేస్తుంటుంది. శ్రీదేవి కూతురుగా ఆమెను తెలుగు తెరకి పరిచయం చేయడానికి ఇక్కడి మేకర్స్ గట్టిగానే ప్రయత్నాలు చేసినప్పటికీ… ఇంత వరకూ అయితే ఆమెను ఎవరూ ఒప్పించలేకపోయారు. ఇదిలా ఉంటే..
ఇటీవల జాన్వీ కపూర్ ఓ ఇంటర్ వ్యూలో తన మనసులో మాటలను బయటపెట్టింది.

ఇంతకీ ఏం చెప్పిందంటే… సౌత్ సినిమాలను తాను తప్పకుండా చూస్తుంటాననీ, ఈ మధ్య కాలంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ తనకి బాగా నచ్చిందని చెప్పింది. ఎన్టీఆర్ – చరణ్ ఇద్దరూ అదరగొట్టేశారంటూ కితాబునిచ్చింది.  తెలుగు హీరోలు ప్రభాస్, మహేష్‌, చరణ్, ఎన్టీఆర్, బన్నీ ఇలా అందరి యాక్టింగ్ తనకి నచ్చుతుందని చెప్పింది. అయితే.. ఎన్టీఆర్ కు జంటగా నటించే ఛాన్స్ వస్తే.. మాత్రం వదులుకోనంటూ ఎన్టీఆర్ పై ఉన్న స్పెషల్ ఇంట్రస్ట్ ను బయటపెట్టింది. మరి.. ఎన్టీఆర్, జాన్వీ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్