Wednesday, September 25, 2024
HomeTrending Newsఅప్పుడు కనబడలేదా?: అంబటి

అప్పుడు కనబడలేదా?: అంబటి

ఎత్తిపోతల పథకాలకు కరెంటు బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తుందని, నిర్వహణ బాధ్యతలు సాగునీటి సంఘాలు చూసుకుంటాయని రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నిర్వహణా లోపాల వల్ల కొన్ని ఎత్తిపోతల ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉన్నమాట వాస్తవమే అయినా తమ ప్రభుత్వం వచ్చిన తరువాతే అవి మరుగునపడలేదని స్పష్టం చేశారు. 250  ఎత్తిపోతల పథకాలు పనిచేయడంలేదంటూ ఓ మీడియాలో వచ్చిన వార్తలపై అంబటి వివరణ ఇచ్చారు. 1989లో మూతపడిన ప్రాజెక్టుకు సిఎం జగన్ ఏం చేస్తారని, 14 ఏళ్ళు చంద్రబాబు సిఎంగా ఉండగా దీనిపై ఎందుకు రాయలేదని అంబటి ప్రశ్నించారు. సిఎం జగన్ పై ఎందుకు విషం చిమ్ముతున్నారని నిలదీశారు.

రాష్ట్రంలో సాగులో ఉన్న భూమి  200 లక్షల ఎకరాలైతే దీనిలో సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, ఎత్తిపోతల పథకాల ద్వారా  104 ఎకరాలు సాగు చేస్తామని, మిగిలిన భూమి వ్యవసాయాధార సాగుపై ఆధారపడి ఉండేదని చెప్పారు. దీనిలో 31  లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు జలయజ్ఞం పేరుతో వైఎస్ నీటి ప్రాజెక్టులు నాటుచేపట్టారని అంబటి వివరించారు.  పోలవరం ప్రాజెక్టుపై తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. చంద్రబాబు అనాలోచిత విధానం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బ తిందని, దీనికి అయన బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.  రైతులు పంటలు వేసేందుకు సిద్దం కావాలని, దీనికోసం ముందుగానే నీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

Also Read : సిఎంను కలిసిన అమెరికా కాన్సుల్‌ జనరల్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్