Saturday, January 18, 2025
Homeసినిమామ‌ళ్లీ సెట్స్ పైకి 'లైగ‌ర్'

మ‌ళ్లీ సెట్స్ పైకి ‘లైగ‌ర్’

Liger Back: సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ లైగ‌ర్. ఇందులో విజ‌య్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే న‌టిస్తుంది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ ఇందులో కీల‌క పాత్ర పోషించ‌డం విశేషం. దీంతో ఈ మూవీ పై అటు అబిమానుల్లోనూ ఇటు ఇండ‌స్ట్రీలోనూ భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అభిమానులు ఎప్పుడెప్పుడు లైగ‌ర్ వ‌స్తుందా అని ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

ఆగ‌ష్టు 25న విడుద‌ల చేయ‌నున్న‌ట్టుగా గ‌తంలో ప్ర‌క‌టించారు. ఇదిలా ఉంటే.. మొత్తం షూటింగ్ కంప్లీట్ అయ్యింది అనుకుంటే.. ఇప్పుడు మ‌ళ్లీ సెట్స్ పైకి వ‌చ్చింద‌ని స‌మాచారం. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఓ సాంగ్ బ్యాలెన్స్ ఉందట‌. బ్యాలెన్స్ ఉన్న ఈ సాంగ్ ను విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే పై ముంబాయిలో చిత్రీక‌రిస్తున్నార‌ని స‌మాచారం. ఈ సాంగ్ తో మొత్తం షూటింగ్ కంప్లీట్ అవుతుంది.

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే ప్ర‌మోష‌న్స్ ను భారీ స్థాయిలో స్టార్ట్ చేయ‌నున్నారు. ఇది విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ. అలాగే విజ‌య్, పూరి ఫ‌స్ట్ కాంబినేష‌న్లో వ‌స్తున్న మూవీ ఫ‌స్ట్ మూవీ. అందుచేత భారీ అంచ‌నాలు ఉన్నాయి. దీంతో విజ‌య్ నార్త్ లో ఎంత వ‌ర‌కు మెప్పిస్తాడు..? ఏ రేంజ్ స‌క్సెస్ సాధించ‌నున్నాడు..? అనేది ఆస‌క్తిగా మారింది.  మ‌రి.. ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తారో చూడాలి.

Also Read : లైగ‌ర్ ఇవ్వబోయే స‌ర్ ఫ్రైజ్ ఏమిటో?

RELATED ARTICLES

Most Popular

న్యూస్