Sunday, January 19, 2025
Homeసినిమాబీహార్ లోనూ లైగర్ కు సూపర్ రెస్పాన్స్

బీహార్ లోనూ లైగర్ కు సూపర్ రెస్పాన్స్

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాల‌తో యూత్ కి బాగా ద‌గ్గ‌ర‌య్యారు. ఇంకా చెప్పాలంటే.. ఈ రెండు చిత్రాల‌తో అన‌తికాలంలోనే స్టార్ స్టేట‌స్ సొంతం చేసుకున్నారు. దీంతో విజ‌య్ తో సినిమాలు చేసేందుకు స్టార్ డైరెక్ట‌ర్స్ అండ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ ఇంట్ర‌స్ట్ చూపించారు. ఆమ‌ధ్య డియ‌ర్ కామ్రేడ్ అనే సినిమాని తెలుగుతో పాటు త‌మిళ్, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో కూడా రిలీజ్ చేశాడు. ఈ మూవీ అంత‌గా ఆక‌ట్టుకోలేదు.

ఇప్పుడు లైగ‌ర్ అంటూ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ లో న‌టించాడు. ఇది విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ. ఆగ‌ష్టు 25న లైగ‌ర్ మూవీని వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. క‌ర‌ణ్ జోహార్ ఈ మూవీని బాగా ప్ర‌మోట్ చేస్తున్నారు. అయితే.. విజ‌య్ ఒక్క హిందీ మూవీ కూడా రిలీజ్ కాకుండానే నార్త్ లో క్రేజ్ సంపాదించుకోవ‌డం విశేషం. లైగ‌ర్ ప్ర‌మోష‌న్స్ కోసం ఎక్క‌డ‌కి వెళ్లినా జ‌న‌మే జ‌నం.

విజయ్ దేవరకొండకి బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా క్రేజ్ ఉందా? అతను ఇంతవ రకు హిందీ సినిమాలు చెయ్యలేదు. కానీ, పాట్నాలో కూడా విజయ్ ని చూసేందుకు జనం ఎగబడడం నమ్మశక్యం కావడం లేదు కానీ నిజంగా అలా జరుగుతుంది. లైగర్ ప్రచారం కోసం విజయ్ దేవరకొండ ఎక్కడికి వెళ్లినా జనం పోటెత్తుతున్నారు. ఈ క్రౌడ్ ను కంట్రోల్ చేయలేక ఈవెంట్స్ క్యాన్సిల్ చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయట. ఇటీవల ముంబైలో జరిగిన లైగర్ ఈవెంట్ జనసంద్రంగా మారిపోయింది. అదే సీన్ బీహార్ రాజధాని పాట్నాలోనూ కనిపించింది. విజ‌య్ కి ఉన్న క్రేజ్ చూస్తుంటే.. లైగ‌ర్ స‌రికొత్త రికార్డులు సృష్టించేలా ఉంది. మ‌రి.. ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి.

Also Read విజ‌య్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్