Sunday, January 19, 2025
Homeసినిమాఅభిమానులకు కిక్ ఇస్తోన్న విజ‌య్, పూరి ‘లైగ‌ర్’ టీజ‌ర్

అభిమానులకు కిక్ ఇస్తోన్న విజ‌య్, పూరి ‘లైగ‌ర్’ టీజ‌ర్

Liger-Teaser out: సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ లైగ‌ర్. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమాపై మొదటినుంచీ భారీ అంచ‌నాలు ఉన్నాయి. క‌రోనా కార‌ణంగా ఆల‌స్యం అయ్యింది కానీ.. లేకపోతే ఈ పాటికే లైగ‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు వచ్చి ఉండేది. అయితే.. ఈరోజు లైగ‌ర్ మూవీ నుంచి టీజ‌ర్ రిలీజ్ చేశారు.

ఈ టీజ‌ర్ లో ఆ వరల్డ్  ఫేమస్ బాక్సింగ్ సెటప్ విజయ్… ముంబై సిటీలో చిన్న స్లమ్ నుంచి ఇండియా బాక్సర్ గా ప్రపంచ స్థాయికి ఎలా ఎదిగాడు అని చూపించే విజువల్స్ కానీ.. అన్నీ సాలిడ్ గా ఉన్నాయి. ముఖ్యంగా విజ‌య్ లుక్ చూస్తుంటే.. నిజంగానే ఫైట‌ర్ అనిపించేలా ఉన్నాడు. విజయ్ దేవ‌ర‌కొండ‌ ఫ్యాన్స్ ఆశించే యాటిట్యూడ్ లో కూడా తన మార్క్ చూపించాడు. విజ‌య్ రొమాంటిక్ మూవీ ఫంక్ష‌న్ లో చెప్పిన‌ట్టుగా లైగ‌ర్ మూవీతో ఇండియా షేక్ అవ్వ‌డం ఖాయం అనిపిస్తుంది. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. లైగ‌ర్ టీజ‌ర్ అదిరింది. 2022లో ఆగ‌ష్టు 25న లైగ‌ర్ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

Also Read : లైగ‌ర్ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్స్

RELATED ARTICLES

Most Popular

న్యూస్