Sunday, January 19, 2025
Homeసినిమాఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఇండియా స్టార్: పూరీ జగన్నాధ్

ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఇండియా స్టార్: పూరీ జగన్నాధ్

విజయ్ దేవరకొండ – పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘లైగర్’ ట్రైలర్ అట్టహాసంగా విడుదలైంది. హైదరాబాద్ , ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో జరిగిన ఈ వేడుకలో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే, పూరీ జగన్నాధ్, సినిమా సహ నిర్మాతలు ఛార్మీ, కరణ్ జోహార్ తదితరులు పాల్గొన్నారు.

రెండేళ్లుగా తన సినిమా విడుదల కాలేదని, అంతకుముందు వచ్చిన సినిమా పెద్దగా చెప్పుకోతగ్గ సినిమా కూడా కాదని, అయినా సరే తనపై అభిమానులు చూపిస్తున్న ఈ ప్రేమ తనకు మెంటలెక్కిస్తోందని విజయ్ వ్యాఖ్యానించాడు. ‘ఈ సినిమా అభిమానులకే అంకితం, ఐ లవ్ యూ’ అన్నాడు.

తాను లైగర్ గురించి చెప్పడం లేదని, విజయ్ గురించే చెబుతున్నానని, రాబోయే కాలంలో ఇండియాలో బిగ్ థింగ్ కాబోతున్నాడని దర్శకుడు పూరీ జగన్నాధ్ ధీమాగా చెప్పాడు. కరణ్ జోహార్ తమకు ఎంతో సపోర్ట్ గా నిలిచారని, ఇక్కడి ప్రేక్షకులు సినిమాను ఎలా ప్రేమిస్తారో చూపించడానికే ఆయన్ను ఇక్కడకు తీసుకు వచ్చానని పూరీ తెలిపాడు.

మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ లు తెలుగు వెర్షన్ ట్రైలర్ ను విడుదల చేయగా మళయాళంలో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ లో రణవీర్ కపూర్ విడుదల చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్