తిరుమల కొండపై శనివారం వేకువజామున విషాదం నెలకొంది. అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడి చేయడంతో ఓ బాలిక మృతి చెందింది. మృతి చెందిన బాలికను లక్షిత (6)గా గుర్తించారు. తిరుమలకు కాలినడకన వెళ్తుండగా లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద ఈ ఘటన జరిగింది.
కాగా, చిన్నారి మృతికి చిరుత కారణం కాదని, ఎలుగు బంటి అని టిటిడి అధికారులు కొందరు చెబుతుండగా, చివరకు విచారణ అనతరం చిరుత కారణమని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. లక్షిత మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించగా పోస్టు మార్టం నిర్వహించారు. చిరుత గాయాలు ఉన్నట్లు నిర్ధారించారు.
నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెం నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చిన కుటుంబం నిన్రాన త్రి అలిపిరి వద్ద 8 గంటల ప్రాంతంలో కాలినడకన బయల్దేరారు. 11 గంటలకు వారు లక్షీనరసింహ స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. కాసేపటికి బాలిక కనబడకపోవడంతో తల్లితండ్రులు ఆందోళనతో వెతుకులాట మొదలు పెట్టారు. అనతరం రంగంలోకి దిగిన పోలీసులు వెతుకులాట మొదలుపెట్టారు. చివరకు నేటి ఉదయం 6.45 గంటల ప్రాంతంలో బాలిక మృతదేహం లభ్యమైంది.