Saturday, November 23, 2024
HomeTrending Newsమెడికల్‌ విద్యార్థులకు బీ-కేటగిరీ.. లోకల్‌ రిజర్వేషన్లు

మెడికల్‌ విద్యార్థులకు బీ-కేటగిరీ.. లోకల్‌ రిజర్వేషన్లు

వైద్య విద్యార్థుల కోసం అన్ని రకాల సదుపాయాల కోసం కృషి చేస్తున్నామని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో నిర్వహించిన మెడ్‌ఎక్స్‌పో కార్యక్రమంలో మంత్రి హరీశ్‌ రావు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో వైద్యవిద్య కోసం ఉక్రెయిన్, రష్యాకు వెళ్లి చదువుకునే వారని చెప్పారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని, రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజి ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో సిద్దిపేటలో రూ.15 కోట్లతో క్యాథలాబ్ గుండె చికిత్స, రేడియో థెరపీ సేవలకు అనుగుణంగా క్యాన్సర్ చికిత్స అందిస్తామన్నారు. సిద్దిపేటలో 900 పడకల దవాఖానను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. మూడేండ్ల నుంచి కరోనా వల్ల ఎక్కడా మెడ్ ఎక్స్‌పో జరగలేదని వెల్లడించారు. రానున్న రోజుల్లో బీ కేటగిరీలో లోకల్ రిజ్వేషన్లు అమలు చేస్తామని, పీజీ సీట్లను 40 వరకు పెంచుతున్నామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్