ఆస్ట్రేలియా క్వీన్స్ ల్యాండ్ రాష్ట్రంలో మూడు రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించారు. రాజధాని బ్రిస్బేన్ తో సహా పదకొండు నగరాల్లో లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. మూడు రోజుల తర్వాత సమీక్ష చేసి అవసరమైతే లాక్ డౌన్ పొడగించటంతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్ విధించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం ఈ రోజు సాయంత్రం నుంచి లాక్ డౌన్ అమలులోకి వస్తుంది. అత్యవసర సర్వీసుల్ని లాక్ డౌన్ నుంచి మినహాయించారు.
బ్రిస్బేన్ నగరంలో ఇటీవల కరోన కేసులు ఎక్కువగా వెలుగు చూడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వేరియంట్ అన్ని దేశాలను కుదిపేస్తున్న తరుణంలో ముందు జాగ్రత్తగా సిడ్నీ, విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్, దక్షిణ ఆస్ట్రేలియా ప్రాంతాల్లో కోవిడ్ నిభందనలు కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కోవిడ్ నిభందనలపై కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నిరసన తెలుపుతున్నారు.