Monday, January 20, 2025
HomeTrending NewsNara Lokesh: క్రిస్టియన్లకు జనాభా ప్రకారం నిధులు: లోకేష్

Nara Lokesh: క్రిస్టియన్లకు జనాభా ప్రకారం నిధులు: లోకేష్

జగన్ ప్రభుత్వం కనీసం 10 శాతం మంది పాస్టర్లకు కూడా గౌరవ వేతనం ఇవ్వడం లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఎన్నికల్లో పాస్టర్లను ఆదుకుంటామని చెప్పిన జగన్ ఇప్పుడు కొందరికే వేతనం ఇస్తున్నారని అన్నారు. తాము అధికారంలోకి రాగానే అందరికీ గౌరవ వేతనంతో పాటు వారికి గుర్తింపు కార్డులు కూడా ఇస్తామని భరోసా ఇచ్చారు. సూళ్ళూరు పేటలో పాస్టర్స్ తో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు.

తాము రాగానే జగన్ ప్రభుత్వం నిలిపివేసిన విద్యా పథకాలను  పునరుద్ధరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వ హయంలో విద్యార్ధులకు మంచి అవకాశాలు కల్పించామని, విదేశీ విద్యను ప్రోత్సహించామని లోకేష్ గుర్తు చేశారు.  అందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ ని పటిష్టం చేశామని, కానీ జగన్ కనీసం ఆస్పత్రులకు బిల్లులు కూడా చెల్లించలేకపోతోందని విమర్శించారు. తాము రాగానే ఈ పథకాన్ని కూడా సక్రమంగా, ఎక్కువ మందికి ఉపయోగపడేలా నిర్వహిస్తామన్నారు. జగన్ పాలనలో చట్టాలు చుట్టలుగా మారాయని,  రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై సిఎం జగన్ కనీసం డిజిపిని పిలిచి సమీక్ష కూడా చేయలేకపోయారని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఒక్కో నేరానికి ఒక్కో రేట్ ఫిక్స్ చేసిందని మండిపడ్డారు. దేవాలయాలు, చర్చిలపై కూడా దాడులు జరగడం శోచనీయమన్నారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, బాబు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చూడాలన్నారు.

క్రిస్టియన్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించి ఆర్ధికంగా ఆదుకుంటామని, మ్యారేజ్ సర్టిఫికేట్ లు ఇచ్చే విషయంలో ప్రస్తుతం అడ్డంకులను తొలగిస్తామని, ఓ శాశ్వత విధానాన్ని తీసుకు వస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. పేదరికంలేని ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్