Saturday, November 23, 2024
HomeTrending Newsపెద్దిరెడ్డికి అక్కడ ఏం పని: లోకేష్ ప్రశ్న

పెద్దిరెడ్డికి అక్కడ ఏం పని: లోకేష్ ప్రశ్న

మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ భరత్ లు ఉద్దేశ పూర్వకంగానే కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని టిడిపి ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యం, ప్రజలపై గౌరవం లేదని విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలు ట్వీట్ పెట్టినా, ప్రెస్ మీట్ పెట్టినా వారిని జైల్లో పెడుతున్నారని ఎద్దేవా చేశారు, ఏడుసార్లు కుప్పం నుంచి గెలిచిన చంద్రబాబు నియోజకవర్గ పర్యటనకు వస్తే అడ్డుకోవడం, అన్నా క్యాంటిన్ ను ధ్వంసం చేయడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు.  ఇటీవల కుప్పంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీసు కేసులు ఎదుర్కొంటూ ప్రస్తుతం చిత్తూరు సబ్ జైలు లో ఉన్న టిడిపి నేతలు, కార్యకర్తలను లోకేష్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఇండియన్ పీనల్ కోడ్ అమలు చేయాల్సిన పోలీసులు జగన్ పీనల్ కోడ్ అమలు చేస్తున్నారన్నారు. కొంతమంది అధికారుల చర్యల వాళ్ళ మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందన్నారు.2024లో అధికారంలోకి వచ్చేది తామేనని ఇప్పుడు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న పోలీసులపై భవిష్యత్తులో వారు ఎక్కడున్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

లోకేష్ మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • చంద్రబాబు కుప్పం పర్యటనకు సరైన భద్రత కల్పించలేదు.  జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నారు?
  • గతంలో ఏనాడూ కుప్పంలో ఇలాంటి పరిస్థితి లేదు
  • ఎస్పీ దగ్గరుండి డైరక్షన్ ఇచ్చి మరీ అన్నా క్యాంటిన్ ధ్వంసం చేయించారు
  • పోలీసులు సజ్జల చెప్పినట్లు నడుచుకుంటున్నారు
  • చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు
  • కానీ ఈ ప్రభుత్వం హంద్రీ నీవాను పూర్తి చేయలేదు
  • వంద కోట్ల రూపాయలతో ఇళ్ళ నిర్మాణం చేపడితే దాని పూర్తి చేయలేదు
  • పెద్దిరెడ్డి, భరత్ లు అక్రమ మైనింగ్ తో దోచుకుంటున్నారు
  • ఇడుపులపాయ పంచాయతీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకూ తీసుకెళ్ళారు
  • ఈ ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుంది, మరింత ఉధృతంగా పోరు చేస్తాం
  • కుప్పంకు 60 కోట్ల రూపాయలు ఇచ్చామని పెద్దిరెడ్డి చెబుతున్నారు
  • తాము వేల కోట్ల రూపాయలతో కుప్పం అభివృద్ధి చేశారు
  • నేను పంచాయతీరాజ్ శాఖా నుంచి 300 కోట్ల రూపాయలు కేటాయించారు
  • ఈ నియోజకవర్గంలో 1400 కోట్ల రూపాయల పనులు కేన్సిల్ చేశారు
  • అసలు కుప్పం నియోజకవర్గంతో పెద్దిరేద్దికి ఏం పని?
  • భరత్ అసమర్ధుడనే పెద్దిరెడ్డి ఆయనకు స్పూన్ ఫీడింగ్ ఇస్తున్నారా?
  • వైఎస్ సిఎంగా ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదు

Also Read : పోలీసులపై లోకేష్ తీవ్ర ఆగ్రహం

RELATED ARTICLES

Most Popular

న్యూస్