Tuesday, January 21, 2025
HomeTrending Newsయాత్ర జరిగి తీరుతుంది: అచ్చెన్నాయుడు

యాత్ర జరిగి తీరుతుంది: అచ్చెన్నాయుడు

ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా నారా లోకేష్ పాదయాత్ర జరిగి తీరుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.  లోకేష్  యాత్రను ఆపడానికి జగన్ ప్రభుత్వం ఎన్నో కుట్రలకు తెరతీసిందని, అందుకే జీవో నంబర్ 1 కూడా తీసుకు వచ్చారని విమర్శించారు.  ఈ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా లోకేష్ తన యాత్ర ఆపేది లేదన్నారు. లోకేష్ పాదయాత్ర చేస్తారనే వార్త వచ్చినప్పటి నుంచీ వైసీపీ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెత్తుతున్నాయని ఎద్దేవా చేశారు. కొందరు మంత్రులు సిఎం జగన్ కు చెంచాగాళ్ళంటూ తీవ్రంగా మండిపడ్డారు, వారైనా సిఎంకు చెప్పి యాత్రకు అనుమతి ఇప్పించాల్సిందని, కానీ వారు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నేడు లోకేష్ జన్మదినం సదర్భంగా ‘యువ గళం’ పాదయాత్ర పోస్టర్ ను ఆయన శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ఎదురు చూస్తున్నారని అయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లోకేష్ కు పార్టీ నేతలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Also Read : లోకేష్ పాదయాత్రకు అనుమతి

RELATED ARTICLES

Most Popular

న్యూస్