Wednesday, March 26, 2025
HomeTrending Newsఅణగారిన వర్గాలకు అండ ఈ జెండా: లోకేష్

అణగారిన వర్గాలకు అండ ఈ జెండా: లోకేష్

తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. “తెలుగుజాతి ఆత్మగౌరవానికి టీడీపీ ప్రతీకగా నిలిచింది….. అణగారిన వర్గాలకు అండగా నిలిచింది పసుపు జెండా… ఏ రాజకీయ పార్టీకి లేని లక్షలాది కార్యకర్తల సైన్యమే టీడీపీ బలం” అంటూ సందేశం ఇచ్చారు.

లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం పెనుకొండ నియోజకవర్గంలో కొనసాగుతోంది. నల్లగొండ్రాయపల్లి విడిది కేంద్రం వద్ద జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో లోకేష్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనతరం కేక్ కట్ చేసి, నేతలు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ వేడుకల్లో మాజీ మంత్రి పరిటాల సునీత, పార్ధ సారథి తదితరులు పాల్గొన్నారు.

Also Read : రాజమండ్రిలో మహానాడు

RELATED ARTICLES

Most Popular

న్యూస్