Sunday, January 19, 2025
HomeTrending Newsవిద్యార్ధులతో లోకేష్ రాజకీయం: నాని

విద్యార్ధులతో లోకేష్ రాజకీయం: నాని

Zoom Row: నారా లోకేష్ విద్యార్ధులతో రాజకీయం చేస్తున్నారని అందుకే తాము జూమ్ మీటింగ్ లో పాల్గొన్నామని మాజీ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. విద్యార్ధులను లోకేష్ రెచ్చగొడుతున్నారని,  ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. గతంలో తాము స్కూళ్ళు ఓపెన్ చేస్తుంటే కోవిడ్ సమయంలో ఎలా క్లాసులు పెడతారంటూ అడ్డు గలిగిన టిడిపి నేతలు పదో తరగతి పరీక్షా ఫలితాలపై రగడ చేస్తున్నారని నాని మండిపడ్డారు. ఆన్ లైన్ లో క్లాసులకు హాజరైన ప్రైవేటు స్కూళ్ళ విద్యార్ధులు ట్యాబ్ లు, మంచి ఫోన్లు, కంప్యూటర్లు, ఐపాడ్ లు  కొనుక్కునారని, పేదలు కొనుక్కోలేకపోయారని, కానీ ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్ధులు ఇవి కొనుక్కోలేకపోయారని. అందుకే వారు ఒకటో, రెండో సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారని నాని వివరించారు.

ఫెయిల్ అయిన విద్యార్ధుల విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఉదారంగా ఆలోచించిందని,  వారికి ఎలాంటి డార్క్ లేకుండా సప్లిమెంటరీ పరీక్షలు వెంటనే నిర్వహించి, దానిలో పాస్ అయినా కూడా రెగ్యులర్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిర్ణయించిందని కొడాలి వెల్లడించారు.

పిల్లలకు ధైర్యం చెప్పాల్సింది పోయి, వారిలో ఆందోళనలు రేకెత్తించేలా, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్ధుల తల్లి దండ్రులను జూమ్ ద్వారా పిలిపించుకోని, మరి కొందరు విద్యార్ధులను కూడా ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని, అందుకే తాము  మాట్లాడేందుకు యత్నించామని చెప్పారు.  తాను తన మేనల్లుడి ఐడి ద్వారా లోకేష్  జూమ్ మీటింగ్ మాట్లాడేందుకు యత్నించానని కొడాలి చెప్పారు.  రాజకీయ అవసరాలకోసం విద్యార్ధులను బలిచేయొద్దని లోకేష్ కు హితవు పలికారు.

Also Read : లోకేష్ జూమ్ లో కొడాలి, వంశీ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్