Thursday, January 23, 2025
HomeTrending NewsNara Lokesh: అదే నా మీద అయి ఉంటే: లోకేష్ వార్నింగ్

Nara Lokesh: అదే నా మీద అయి ఉంటే: లోకేష్ వార్నింగ్

ఎర్రగొండపాలెం ఘటనపై తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. దళితులకు జగన్ మోహన్ రెడ్డి పీకిందేమీ లేదని తాను మాట్లాడితే ఆ వీడియోను మార్ఫింగ్ చేసి దళితులను అన్నట్లు చిత్రీకరించారని విమర్శించారు. బాబు వాహనంపై రాళ్ళదాడి చేయడం దారుణమని, మీది బాబు స్థాయికాదని, దమ్ముంటే తన వద్దకు రావాలని, తానెంటో చూపిస్తానంటూ హెచ్చరించారు. ‘ఆయన రాముడు కాబట్టి ఆరోజు బతికారు మీరు, అదే మాజోలికి వచ్చిఉంటే భలే ఉండేది ఫిట్టింగ్’ అంటూ వ్యాఖ్యానించారు.

వైసీపీ నేతలకు చొక్కాలు విప్పడం బాగా అలవాటైపోయిందని, హిందూపురం ఎంపీ షర్ట్ తో పాటు ఫ్యాంట్ కూడా తీసేశారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో అవంతి శ్రీనివాసరావు కూడా చొక్కా విప్పి ఎవరితోనో మాట్లాడడం చూశామని, ఆ వీడియో కూడా అందరం చూశామన్నారు. ఇప్పుడు మంత్రి సురేష్ కూడా చొక్కా విప్పారని, మీ అందరినీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చేసింది షర్టు విప్పడానికి కాదని, సమాజానికి సేవ చేయడానికని పేర్కొన్నారు. మంత్రి సురేష్ ఇప్పటి వరకూ దళితులకు ఏం చేశారో చెప్పాలని, ఈ ప్రభుత్వం దళితులను చంపేస్తుంటే వారికి అండగా ఎందుకు నిలబడలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలపై కేసులు పెడుతుంటే ఆ శాఖా మంత్రి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్