Monday, February 24, 2025
HomeTrending NewsLokesh Padayatra: 400 రోజులు, 4 వేల కిలోమీటర్లు

Lokesh Padayatra: 400 రోజులు, 4 వేల కిలోమీటర్లు

Mangalagiri: 2023 జనవరి 27 నుంచి తన పాదయాత్ర మొదలవుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్న లోకేష్ నూతక్కి గ్రామంలో గత రాత్రి ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.

ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గాన్ని తెలుగుదేశం కంచుకోటగా మార్చామని, తన పాదయాత్ర ఈ నియోజకవర్గంలో నాలుగు రోజులే సాగుతుందని, మిగిలిన 396 రోజులూ రాష్ట్ర వ్యాప్త యాత్రలోనే ఉంటానని చెప్పారు.  తనను ఓడించేందుకు సిఎం జగన్ అన్ని ఆయుధాలు వాడతారని.. కాబట్టి ఇక్కడి కార్యకర్తలు ధీటుగా పోరాటం చేసి అధికార పార్టీ కుయుక్తులను తిప్పి కొట్టాలని పిలుపు ఇచ్చారు. ‘తెలుగుదేశం కంచుకోట మంగళగిరిలో టిడిపి కాపు కాసే బాధ్యత మీరే తీసుకోవాలి’ అంటూ సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్