Tuesday, September 17, 2024
HomeTrending Newsబుడమేరును పరిశీలించిన మంత్రి లోకేష్

బుడమేరును పరిశీలించిన మంత్రి లోకేష్

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బుడమేరుకు పడిన గండ్ల పూడ్చివేత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్ ను సిఎం ఆదేశించారు. బుడమేరు కుడి, ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్లను పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన లోకేష్… అనంతరం బుడమేరు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.  విజయవాడతో పాటు రేపల్లెలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించాలని చంద్రబాబు భావించినా… వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.

టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నాం.
  • ప్రతి ఇంటికి సహాయం అందించాలి. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాల వారికి అప్పగించాలి.
  • ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు నిర్వహించాలి.
  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం తరపున అందించాలి.
  • వరద తగ్గినందును ఆహారం డోర్ టు డోర్ వెళ్లే అవకాశం ఉంది.
  • ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదంప, కేజీ చక్కెర అందించాలి.
  • మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా అతి తక్కువ ధరకు కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలి.
  • నష్టాన్ని వివరించి కేంద్ర సాయం కోరదాం.
  • ఆహారం, నీరు, బిస్కెట్స్, పాలు, అరటిపండ్లు అన్నీ డోర్ టు డోర్ అందాలి.
  • అన్ని అంబులెన్స్ లు పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టండి.
  • విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాలి. శానిటేషన్ పనులు ఒక యుద్దంలా జరగాలి.
  • ప్రతి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటికి సంబంధించిన వారిని భాగస్వామ్యులను చేయండి.
  • వైరల్ ఫీవర్లు, దోమల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కరపత్రాల ద్వారా ప్రజలను చైతన్య పరచండి
  • ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి. ఎవరికి ఏం మెడిసిన్ కావాలన్నా అందించాలి.
  • పంట నష్టంపై అంచనాలు నమోదు చేయండి.
RELATED ARTICLES

Most Popular

న్యూస్