Monday, February 24, 2025
HomeTrending Newsచంద్రబాబు చిటికేస్తే...:  లోకేష్ హెచ్చరిక

చంద్రబాబు చిటికేస్తే…:  లోకేష్ హెచ్చరిక

వైసీపీ కార్యకర్తలు తన పాదయాత్రపై కత్తులు, రాళ్ళతో దాడికి యత్నిస్తే ఎలాంటి కేసూ పెట్టలేదని, కానీ తానూ స్టూలు ఎక్కి ప్రసంగిస్తే తనపై కేసులు పెడుతున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. గన్నవరంలో తమ పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే తిరిగి టిడిపి కార్యకర్తలపైనే కేసులు పెట్టారని విమర్శించారు. యువ గళం పాదయాత్రలో భాగంగా శ్రీకాళహస్తిలో ఆయన ప్రసంగించారు.  చంద్రబాబు ఒక్క చిటికేస్తే తమ సత్తా ఏమిటో వైసీపీకి చూపిస్తామని హెచ్చరించారు.

“ఏం మాకు పౌరుషం లేదనుకుంటున్నారా? మీసాలు తిప్పి చెబుతున్నా, రా చూస్తా’ అంటూ లోకేష్ సవాల్ విసిరారు. తమ ఓర్పు, సహనాన్ని పరీక్షించవద్దని వైసీపీ కార్యకర్తలకు సూచించారు. తమపై దాడి చేసిన వారిని కట్ డ్రాయర్ తో ఊరేగిస్తా బీ కేర్ ఫుల్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్