1.3 C
New York
Thursday, December 7, 2023

Buy now

HomeTrending Newsజమ్మూలో శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం

జమ్మూలో శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం

జమ్మూకశ్మీర్ లోని జమ్మూ లో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయమునకు TTD ఆధ్వర్యంలో ఈ రోజు భూమి పూజ జరిగింది. జమ్మూకశ్మీర్  లెఫ్ట్ నెంట్  గవర్నర్  మనోజ్ సిన్హా భూమి పూజ చేయగా కార్యక్రమంలో  టీటీడీ ఛైర్మన్  వైవి సుబ్బారెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 18 నెలల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు.

ఏడాదికి ఒక “కనాల్” కు 10 రూపాయల అద్దె చొప్పున శ్రీవారి ఆలయానికి తీసుకున్న భూమిని 40 ఏళ్లపాటు లీజ్ కు ఇచ్చేందుకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం – టిటిడి మధ్య ఒప్పందం జరిగింది . జమ్మూ జిల్లాలోని మజీన్ గ్రామంలో దేవాలయానికి భూమిని కేటాయించగా వేంకటేశ్వర స్వామి ప్రధాన దేవాలయంతో పాటు, ఆండాల్, పద్మావతి అమ్మవార్ల ఉప దేవాలయాలు నిర్మిస్తారు.

గర్భాలయం, ఆరాధన మండపం దక్షిణ భారత దేశ శైలిలో గ్రానైట్ తో నిర్మాణం చేసి, దేవాలయ ప్రాకారపు గోడ, ప్రవేశ ద్వారంతో కూడిన మూడు అంతస్తుల రాజగోపురాన్ని పూర్తిగా రాతితో నిర్మాణం చేస్తారు. రాజగోపురం పైకప్పు వరకు రాతితో నిర్మాణం చేసి, పైకప్పు నుంచి మిగిలిన గోపుర నిర్మాణం మాత్రం సిమెంటుతో కట్టేందుకు నిర్ణయించారు.

మొత్తం 62 ఎకరాల 10 సెంట్ల లో 33 కోట్ల 22 లక్షల రూపాయలతో రెండు విడతలుగా దేవాలయ నిర్మాణం చేపడతారు. తొలి విడతలో 27 కోట్ల 72 లక్షలతో వాహన మండపం, అర్చకులు, ఇతర పాలనా సిబ్బందికి  వసతి గృహాలు, తీర్థయాత్రికులకు వేచి ఉండే హాల్, ఇతర మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయి. రెండవ విడతలో మొత్తం 5 కోట్ల 50 లక్షల రూపాయలతో వేద పాఠశాల, కల్యాణ మండప నిర్మాణం జరుగుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్