Sunday, January 19, 2025
Homeసినిమాసెప్టెంబర్ 24న ‘లవ్ స్టోరి’ విడుదల

సెప్టెంబర్ 24న ‘లవ్ స్టోరి’ విడుదల

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా ‘లవ్ స్టోరి’ ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెర పై చూసేందుకు ఆడియెన్స్ చాలా రోజులుగా వేచి చూస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ “తప్పనిసరి పరిస్థితుల వల్ల ఇన్నాళ్లూ మా ‘లవ్ స్టోరి’ ని వాయిదా వేస్తూ వచ్చాం. మా సినిమాను మీకు ఎప్పుడు చూపించాలి అనే ఆత్రుతగా, సరైన సమయం కోసం వేచి చూశాం. ఆ గుడ్ టైమ్ రానే వచ్చింది. ఈ నెల 24న మా చిత్రాన్ని థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. థియేటర్లలో కలుసుకుందాం. వినాయక చవితి శుభాకాంక్షలు” అన్నారు.

‘లవ్ స్టోరి’ లో పాటలు అనూహ్య ఆదరణ పొందాయి. యూట్యూబ్ వ్యూస్ లో ‘సారంగదరియా’ ఆల్ టైమ్ రికార్డులు తిరగరాసింది. ‘హే పిల్లా’, ‘నీ చిత్రం చూసి..’ పాటలు కూడా మ్యూజిక్ లవర్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించాయి. ‘లవ్ స్టోరి’ మ్యూజికల్ గా హిట్ అవడం సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల చూపించబోయే ప్లెజంట్, ఎమోషనల్ ప్రేమ కథకు ఈ పాటలు అదనపు ఆకర్షణ కానున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్