Saturday, November 23, 2024
HomeTrending Newsత్రివిధ దళాల అధిపతిగా...లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్

త్రివిధ దళాల అధిపతిగా…లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్

Anil Chauhan : భారత త్రివిధ దళాల అధిపతిగా.. లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ బాధ్యతలు చేపట్టనున్నారు. భారత తొలి సిడి ఎస్ బిపిన్ రావత్.. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన 9 నెలల తర్వాత రెండో సీడీఎస్‌గా అనిల్ చౌహాన్‌ను నియమిస్తూ.. కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ (Chief of Defence Staff)గా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్.. 2021 మే నెలలో ఈస్టర్న్ కమాండ్ చీఫ్‌గా రిటైర్ అయ్యారు. ఆయన్నే తాజాగా సీడీఎస్‌గా నియమిస్తూ.. భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అనిల్ చౌహన్ ఖడక్ వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA).. డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమి(IMA)లో చదువుకున్నారు. 1981లో భారత సైన్యంలోని 11 గూర్ఖా రైఫిల్స్‌లో పనిచేశారు. అనిల్ చౌహన్.. నార్తర్న్ కమాండ్‌లోని బారాముల్లా సెక్టార్‌లో సైన్యానికి నాయకత్వం వహించారు. నార్త్ ఈస్ట్‌లోని కార్ప్స్‌కి లెఫ్టినెంట్ జనరల్‌గా నాయకత్వం వహించారు. 2019 సెప్టెంబర్‌లో తూర్పు కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా సేవలు అందించారు. గత ఏడాది మే నెలలో పదవీ విరమణ పొందారు. ఆయన భారత ప్రభుత్వ సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పని చేయనున్నారు.

గతేడాది డిసెంబర్‌లో తమిళనాడులోని నీలగిరికొండల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో.. భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతిచెందారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన భార్యతో వెళ్తున్న సమయంలో.. నీలగిరికొండల్లో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు మరో 13 మంది మరణించారు. ఆ ఘటనలో ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లను సమన్వయం చేసేందుకు.. మోదీ సర్కార్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని తీసుకొచ్చింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్