Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఐపీఎల్: చెన్నైపై లక్నో విజయభేరి

ఐపీఎల్: చెన్నైపై లక్నో విజయభేరి

Lucknow- The Giants : ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. చివరి మూడు ఓవర్లలో 46 పరుగులు కావాల్సి ఉండగా బదోనీ, లూయూస్ చెలరేగి ఆడారు. ముఖ్యంగా శివం దూబే వేసిన 19వ ఓవర్లో ఇద్దరూ కలిసి 25 పరుగులు రాబట్టారు.  ఇవాన్ లూయిస్ 23  బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. చెన్నై విసిరిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే లక్నో ఛేదించింది.

ముంబైలోని బార్బౌర్న్ స్టేడియం వేదికగా జరిగిన ఈ లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై 28 పురుగులకు తొలి వికెట్ (రుతురాజ్ గైక్వాడ్-1) కోల్పోయింది. మరో ఓపెనర్ రాబిన్ ఊతప్ప అర్ధ సెంచరీ (50, 27 బంతులు, 8ఫోర్లు, 1సిక్సర్)తో రాణించాడు. శివం దూబే-49; అంబటి రాయుడు-27, జడేజా-17, చివర్లో ధోనీ ఆరు బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ తో 16  పరుగులు చేసి అజయంగా నిలవడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో ఆవేష్ ఖాన్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో దూకుడుగా ఆట మొదలు పెట్టి తొలి వికెట్ కు 99 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. కెప్టెన్ రాహూల్-40 పరుగులు చేసి తొలి వికెట్ గా ఔటయ్యాడు, మనీష్ పాండే కేవలం ఐదు పరుగులకే వెనుదిరిగాడు. మరో ఓపెనర్ డికాక్ 45 బంతుల్లో 9 ఫోర్లతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. దీపక్ హుడా (13)కూడా త్వరగా పెవిలియన్ చేరాడు. ఈ దశలో లూయీస్, ఆయుష్ బదోనీలు కలిసి దూకుడుగా ఆడి మరో వికెట్ పడకుండా జట్టును గెలిపించారు. చెన్నై బౌలర్లలో ప్రెటోరియస్ రెండు; తుషార్ దేశ్ పాండే, బ్రావో చెరో వికెట్ పడగొట్టారు.

లూయీస్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : ఐపీఎల్: కోల్ కతాపై బెంగుళూరు విజయం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్